Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడులో ఆర్మీ ఎంఐ-17వీ-5 హెలికాప్టర్ ప్రమాదంతో చర్చ
న్యూఢిల్లీ: వీఐపీలకు ప్రమాదం జరిగిన వెంటనే..వారు వినియోగించే విమానాలు, హెలికాప్టర్ల గురించి దేశప్రజలు చర్చించుకుంటుంటారు. తాజాగా బుధవారం తమిళనాడులో ఆర్మీ ఎంఐ-17వీ-5 హెలికాప్టర్ కూలిపోవడంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది చనిపోగా...ఈ హెలికాప్టర్లోనే దేశప్రధాని మోడీ కూడా పర్యటనకు వెళ్తుంటారని అధికారవర్గాలు అంటున్నాయి. హెలికాప్టర్ కూలాక..ప్రధాని భద్రత విషయంలో రక్షణశాఖ మరింత అప్రమత్తమైంది.
ఆర్మీ ఎంఐ-17వీ-5 హెలికాప్టర్ ప్రత్యేకత ఏమిటంటే..
రష్యాలో తయారు చేయబడిన ట్విన్ ఇంజన్ మల్టీపర్పస్ హెలికాప్టర్ ఇది.ఆర్మీ ఎంఐ-17వీ-5 హెలికాప్టర్ (డొమెస్టిక్ హౌదా ఎంఐ..8 ఎంటీవీ..5) అనేది ఎంఐ-8/17 హెలికాప్టర్లకుచెందిన సైనిక రవాణా రూపాంతం. దీన్ని రష్యన్ హెలికాప్టర్ల అనుబంధ సంస్థ అయిన కజాన్ హెలికాప్టర్స్చే తయారు చేసింది. ఇది రష్యన్ కంపెనీ మిల్ మాస్కో హెలికాప్టర్ ప్లాంట్, కజాన్ హెలికాప్టర్ ప్లాంట్ , ఉలాన్-ఉడే ఏవియేషన్ ప్లాంట్‌లో తయారు చేశారు. ఎంఐ-17వీ-5 హెలికాప్టర్ ఎంఐ-8 హెలికాప్టర్ యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్. రష్యాలో తయారు చేసిన ఈ హెలికాప్టర్‌కు భారతీయ వైమానిక దళంలో ఎక్కువగా వినియోగిస్తారు.
ఈ హెలికాప్టర్ సామర్థ్యం ఏమిటంటే..
ఏంఐ-17వీ-5 అధిక ఎత్తులో దూసుకెళ్లటమే కాదు. అనుకూలమైన వాతావరణ లేనప్పుడు కూడా మెరుగ్గా పని చేస్తుంది. ఇది ఏంఐ-8 యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రూపొందించినది. ఏంఐ-17వీ-5 వీవీఐపీలు మొదలుకుని సైన్యం కూడా వినియోగిస్తున్నది.ప్రపంచంలోనే అత్యంత అధునాతన హెలికాప్టర్‌గా పరిగణిస్తారు. ఇది సైనిక దళం, ఆయుధాల రవాణా, ఫైర్ సపోర్ట్, గార్డు పెట్రోలింగ్, సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్ఏఆర్) మిషన్లలో కూడా ఉపయోగిస్తారు.అలాగే ఏంఐ-17వీ-5 కార్గో రవాణా కోసం రూపొందించబడింది. దీన్ని ప్రధాని మోడీ మొదలుకుని, ఆర్మీ ఆపరేషన్‌లో వాడుతున్నారు. ప్రపంచంలోని 60 దేశాలు 12 వేలకు పైగా ఎంఐ-17 హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నాయి.
36 మంది ప్రయాణించేలా..
ఈ హెలికాప్టర్లో.. ముగ్గురు సిబ్బందితో పాటు 36 మంది సైనికులు ప్రయాణించవచ్చు.అలాగే 36 వేల కిలోల బరువును ఎత్తగలదు. అయితే వీవీఐపీల కోసం రూపొందించిన ఈ ప్రత్యేక హెలికాప్టర్లో గరిష్టంగా 20 మంది మాత్రమే ప్రయాణించగలరు. వీవీఐపీల కోసం హెలికాప్టర్లో టాయిలెట్ సౌకర్యం కూడా ఉన్నది. ఈ హెలికాప్టర్లో ఆయుధాలు ఉండటం వల్ల శత్రువులు, సాయుధ వాహనాలు, భూ-ఆధారిత లక్ష్యాలతో పాటు ఇతర స్థిరమైన, కదిలే వాటిని గురి అంతమొందించేలా రూపకల్పన చేశారు. ఎంఐ17 వేగం గంటకు 1000 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది.ఎంఐ-17 8 ఎం/ఎస్% వేగంతో ఎత్తుకు చేరుకోగలదు.ఇది గరిష్టంగా 6,000 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది.హెలికాప్టర్ బరువు దాదాపు 7,489 కిలోలు, దాని గరిష్ట బరువు 13,000 కిలోలు. వీవీఐపీలను రవాణా చేయడమే కాకుండా, రెస్క్యూ మిషన్లలో కూడా దీనిని ఉపయోగిస్తారు.
భారతదేశం ఏంఐ-17వీ-5ని ఎప్పుడు ఆర్డర్ చేసింది?
డిఫెన్స్ మినిస్ట్రీ డిసెంబర్ 2008లో 80 ఎంఐ హెలికాప్టర్ల కోసం రష్యాతో1.3 బిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది. భారత వైమానిక దళానికి ఎంఐ హెలికాప్టర్ల డెలివరీ 2011లో ప్రారంభమైంది. 36 ఎంఐ సిరీస్ హెలికాప్టర్లు 2013లో అందాయి. అయితే, రక్షణ మంత్రిత్వ శాఖ 2012-2013 మధ్యకాలంలో ఏంఐ-17వీ-5 కి చెందిన మరో 71 హెలికాప్టర్లను ఆర్డర్ చేసింది. 2018లో ఆ హెలికాప్టర్లు వచ్చాయి. 2019 ఏప్రిల్ హెలికాప్టర్ల మరమ్మతుల కోసం భారత వైమానిక దళం ఏర్పాటు చేసింది.2014..అక్టోబర్ లో కజాన్ హెలికాప్టర్స్ లిమిటెడ్ ద్వారా 63 ఏంఐ-17వీ-5 లను ఆఫ్ఘన్ సైన్యానికి అందించడానికి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ 2011లో ఒప్పందం కుదుర్చుకున్నది.