Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్లో రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్ ఉభయసభల్లో గురువారం ప్రకటన చేశారు. అనంతరం ఉభయ సభలు రావత్ మృతికి సంతాపం ప్రకటిస్తూ.. రెండు నిమిషాలు మౌనం పాటించాయి. హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరమని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. అలాగే ఈ ప్రమాదం నుండి బయపటడిన కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారని తెలిపారు. '2021 డిసెంబర్ 8 మధ్యాహ్నం భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న మిలటరీ హెలికాఫ్టర్ కూలిపోయిందనే దురదృష్టకర వార్తను బాధాతప్త హృదయంతో చెబుతున్నా. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ స్టాఫ్ కాలేజ్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నిన్న ఉదయం 11:48 గంటలకు సూలూరు ఎయిర్‌బేస్ నుంచి ఎంఐ 17వి5 హెలికాప్టర్లో రావత్, ఆయన భార్య మధులిక రావత్, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లింగ్టన్ బయల్దేరారు. మధ్యాహ్నం 12:15 గంటలకు వీరు ల్యాండ్ అవ్వాల్సి ఉండగా..12.08 గంటల ప్రాంతంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు హెలికాప్టర్ రాడార్ నుండి సంకేతాలు తెగిపోయాయి. కున్నూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలను గుర్తించిన స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే హెలికాప్టర్ మంటల్లో ఉంది. సమాచారమందుకున్న సహాయక బందం అక్కడకు చేరుకుంది. ఘటనా స్థలం నుండి అందరినీ విల్లింగ్టన్లోని మిలటరీ ఆస్పత్రికి చేర్చారు. వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాదంలో రావత్, ఆయన భార్య సహా 13 మంది మరణించడం బాధాకరం'' అని రాజ్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు. రావత్ అంత్యక్రియలను శుక్రవారం సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నట్టు రాజ్‌నాథ్ వెల్లడించారు. గురువారం సాయంత్రం రావత్, ఆయన భార్య మధులిక, ఇతర అధికారుల భౌతికకాయాలు ఢిల్లీకి చేరుకున్నాయి. ప్రమాదంపై భారత వాయుసేన.. త్రివిధ దళాల దర్యాప్తును ఆదేశించినట్టు రాజ్‌నాథ్ ప్రకటించారు. ఎయిర్ మార్షల్ మానవీంద్ర సింగ్ నేతృత్వంలో ఈ దర్యాప్తు జరుగుతుందన్నారు
దొరికిన బ్లాక్ బాక్స్.. !
కుప్పకూలిన ఎంఐ-17వి5 హెలికాప్టర్‌కి చెందిన బ్లాక్ బాక్స్ గురువారం లభ్యమైంది. ప్రమాద స్థలానికి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్ లభ్యమైనట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం నుండి వింగ్ కమాండర్ భరద్వాజ్ ఆధ్వర్యంలో బ్లాక్‌బాక్స్ కోసం సెర్చింగ్ జరిగిందని అన్నారు. డీ-కోడింగ్ కోసం ఈ బ్లాక్ బాక్స్‌ను ఢిల్లీ ఎయిర్‌ఫోర్స్ నిపుణుల బృందం ఢిల్లీకి తరలించింది. సాధారణంగా బ్లాక్‌బాక్స్‌లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా స్టోర్ అవుతుంది. ఇందులో పైలట్ల సంభాషణలు కూడా రికార్డయ్యే అవకాశముంది. ఈ బాక్స్ దర్యాప్తులో కీలకం కానుంది. మరోవైపు ప్రమాదస్థలానికి చేరుకున్న తమిళనాడు ఫోరెన్సిక్ బందం ఘటన ఎలా జరిగిందన్న దానిపై నిశితంగా పరిశీలిస్తోంది.
మూడు బిల్లుల ఆమోదం లోక్‌సభలో రెండు, రాజ్యసభలో ఒకటి
పార్లమెంట్ ఉభయ సభలు మూడు బిల్లులు ఆమోదం పొందాయి. లోక్‌సభలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) బిల్లు, ఢిల్లీ పోలీస్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (సవరణ) బిల్లులు ఆమోదం పొందగా, రాజ్యసభలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (సవరణ) బిల్లు ఆమోదం పొందింది.