Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీకాలు అందించడంలో వేగం పెంచండి : డబ్ల్యూహెచ్ఓ
న్యూఢిల్లీ: ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాథమిక డేటా ప్రకారం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఇతర వేరియంట్ల కన్నా అధికంగానే ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ అన్నారు. అయితే, ఇతర వేరియంట్ల కంట ఒమిక్రాన్ ప్రభావం కాస్త తక్కువగా ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే, ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి గమనాన్ని మార్చగలిగే అవకాశాలు సైతం ఉన్నాయని హెచ్చరించారు. వీలైనంత త్వరగా అందరికీ టీకాలు వేయాలని సూచిం చారు. ప్రపంచ దేశాలు కరోనా కట్టడి చర్యలతో పాటు ప్రజల సంరక్షణ చర్యలన సైతం వేగవంతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ మారుతోంది, కానీ మన సామూహిక సంకల్పం మారకూడదనీ, దానిని ఎదుర్కొనే చర్యలకు సిద్ధం కావాలని అన్నారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ తేలికపాటిదని ప్రారంభ సాక్ష్యాలు ఉన్నప్పటికీ, ఇది ఖచ్చితంగా నిర్ధారించడానికి వీలు లేకుండా ఉందని, ఒమిక్రాన్ వేరియంట్లో జరుగుతున్న ఉత్పరివర్తనాలు అందుకు కారణమని టెడ్రోస్ అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్లో అసాధారణ మ్యుటేషన్‌ను గుర్తించిన నేపథ్యంలో కొత్త వేరియంట్ పై టీకాల ప్రభావశీలత తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే మొత్తానికే టీకా నుంచి లభించే రక్షణను ఒమిక్రాన్ వేరియంట్ ఏమార్చలేదని వెల్లడించారు. మొదటి దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు విస్తరిం చింది. ప్రస్తుతం ఈ వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికా కరోనా నాల్గోవేవ్ ప్రారంభమైంది. అయినప్పటికీ ఒమిక్రాన్‌పై ఖచ్చితమైన ఓ నిర్ణయానికి రావడానికి మరింత డేటా అవసరమున్నదని టెట్రోస్ తెలిపారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంతో పాటు వైరస్ బారినపడే ప్రమాదం అధికంగా ఉన్న వారికి టీకాలు వేయడంలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ను గుర్తించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఆఫ్రికా దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి.