Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒమిక్రాన్ విజృంభణతో భారత్ నిర్ణయం
- డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడి
న్యూఢిల్లీ :ఒమిక్రాన్ విజృంభిస్తున్న కారణంగా ...జనవరి 31 వరకు అంతర్జాతీయ విమానాలను నిషేధం విధిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం టేకాఫ్ చేయాల్సిన ఇంటర్నేషనల్ ఫ్లైట్‌ను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. అయితే ఆల్ కార్గో విమానాలు,ప్రత్యేకంగా అనుమతించిన విమానాలపై ఈ నిషేధం ఉండదని తెలిపింది. కోవిడ్..19 కారణంగా..2021 నవంబర్ 26న ఇచ్చిన మార్గదర్శకాలను మారుస్తూ..డీజీసీఏ తాజా ఆదేశాలిచ్చింది. అయితే కొన్ని రూట్లలో పరిమితంగా విమానరాకపోకలకు అనుమతించింది. తాజా ఆదేశాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కచ్చింగా పాటించాలని సూచించింది. అయితే ముందుగా నవంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాలకు అనుమతిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత డిసెంబర్ 15 వరకూ పొడిగించిన విషయం విదితమే. కరోనా మహమ్మారి కారణంగా 2020..మార్చి 23న అంతర్జాతీయ విమానాలను నిలిపివేసిన విషయం విదితమే. అనంతరం 28 దేశాల్లో బబూల్ అరెంజ్మెంట్స్ ప్రయాణలకు అనుమతించింది. ప్రస్తుతం 32 దేశాలతో భారత్ బబూల్ అరెంజ్ ఉన్నట్టు డీజీసీఏ తెలిపింది.