Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లారీ ఢకొీనడంతో వాగులో పడ్డ ఆటో
- ఒకరు మృతి
- ఆరుగురు సురక్షితం... ఐదుగురి గల్లంతు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢకొీన్నడంతో ఆటో వాగులో పడిపోయింది. ఆటోలో ప్రయాణీస్తున్న 12 మందిలో ఒకరు మరణించారు. ఆరుగురు సురక్షితంగా బయట పడ్డారు. ఐదుగురు గల్లంతయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆత్మకూరు పట్టణం జ్యోతినగర్‌కు చెందిన 12 మంది బంధువులు, స్నేహితులు కలిసి సంగం వద్ద ఉన్న శివాలయంలో రాత్రి నిద్రచేయడానికి బయల్దేరారు. ఆటో బీరాపేరు బ్రిడ్జిపైకి రాగానే నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వెళుతున్న లారీ ఎదురుగా వస్తోన్న ఆటోను వేగంగా ఢకొీట్టింది. దీంతో ఆటో బ్రిడ్జిపై నుంచి వాగులో పడింది. వాగులో ఓ చెట్టును పట్టుకొని ఉన్న ఆరుగురిని స్థానికులు,పోలీసులు రక్షించారు. ఓ బాలిక (నాగవల్లి (14)ని రక్షించే క్రమంలో ఆమె మరణించింది. మిగతా వారి కోసం గాలించగా వారి ఆచూకీ లభించలేదు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకమేర్పడింది.
విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు
విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి చెందిన పోలిపల్లి రమణ(48) కుటుంబం బతుకు తెరువు కోసం విశాఖ నగరానికి వచ్చి రజక వృత్తి చేసుకుంటూ వన్‌టౌన్ ఏరియా పందిరిపేటలో నివాసముంటుంది. రమణ తమ స్వగ్రామంలో పెళ్లికి వెళ్లి తిరిగి గురువారం ఉదయం భార్య లక్ష్మీ (38), కుమార్తె శాంతి కుమారి(23)తో కలిసి ద్విచక్ర వాహనంపై విశాఖకు బయలుదేరారు. మధురవాడ పరిధి చంద్రంపాలెం జెడ్పి హైస్కూల్ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న లారీ వారిని బలంగా ఢకొీట్టి, వారి పైనుండి వెళ్లిపోయింది. ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.