Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్ ఆకస్మిక మృతితో తదుపరి త్రిదళాధిపతి (సీడీ ఎస్)గా ఎవరు నియమితుల వుతారన్న విషయం ఆసక్తి కరంగా మారింది. ఆర్మీ అధి పతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె ఈ బాధ్య తలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్మీ, నేవీ, వాయుసేన అధిపతుల్లో ఒకరిని సీనియార్టీ ప్రకారం ఈ పదవికి ఎంపిక చేస్తారు. నేవీ, వాయుసేనల అధి పతులు ఇటీవల కాలంలోనే పదవులు చేపట్టినందున వారిలో సీనియర్ అయిన జనరల్ నరవణెకే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆర్మీ చీఫ్గా జనరల్ రావత్ నుంచే ఆయన 2019 డిసెంబరు 31న బాధ్యతలు చేపట్టారు. నేవీ అధిపతి అడ్మిరల్ ఆర్.హరి కుమార్ కేవలం ఎనిమిది రోజుల క్రితం, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి సెప్టెంబరు 30న బాధ్యతలు చేపట్టారు. ఈ దృష్ట్యా జనరల్ నరవణెకే అవకాశాలు అధికంగా ఉన్నట్టు భావిస్తున్నారు.