Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 8,503 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా కేసులు 3.46 కోట్లకు చేరాయి. అందులో 3.40 కోట్ల మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం దేశంలో 94,943 క్రియాశీల కేసులున్నాయి. ఇక క్రియాశీల రేటు 0.27 శాతానికి చేరింది. గురువారం ఒక్కరోజే 7,678 మంది కరోనా నుంచి కోలుకోగా రికవరీ రేటు 98.36 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 624 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు 4,74,735 మంది కరోనాకు బలయ్యారు. ఇప్పటివరకు 131 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గురువారం ఒక్కరోజే 74.5 లక్షల మంది టీకా వేయించుకున్నారు. కరోనా కేసులు తగ్గినా.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది.
24 మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా
కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని ఒక నర్సింగ్ కళాశాలలో 24 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కళాశాలను, అనుబంధ ఆసుపత్రిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నాలుగైదు రోజుల కిందట విద్యార్థులు శివమొగ్గలో పరీక్షలు రాసేందుకు వెళ్లి వచ్చారని, అనంతరం పలువురికి కరోనా లక్షణాలు కనిపించాయని జిల్లా సీనియర్ అధికారి తెలిపారు.