Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిర్ క్వాలిటీ కమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : ఢిల్లీలో గాలి నాణ్యతలో పురోగతి ప్రారంభమయిందన్న సుప్రీంకోర్టు, పరిశ్రమలు, నిర్మాణాలు, ఫ్యాక్టరీలతో సహా ఢిల్లీలో విధించిన నిబంధనలు సడలింపుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎయిర్ క్వాలిటీ కమిషన్ను ఆదేశించింది. ఈ విషయంపై ప్యానల్ వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం స్పష్టం చేసింది. నిబంధనలు సడలించాలని వివిధ పరిశ్రమల యజమానులు, ఇతర బాధిత ప్రజలు వేసిన పిటీషన్ విచారణలో శుక్రవారం ఈ ఆదేశాలు ఇచ్చింది.