Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిరంతర ప్రక్రియ అని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం ఆయన రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాన్కోర్)లోనూ డిజిన్వెస్ట్మెంట్ కొనసాగుతుందన్నారు. ఈ సంస్థలో 1994-95 కాంగ్రెస్ హయంలోనే ఈ ప్రక్రియ మొదలయ్యిందన్నారు. కొన్ని పీఎస్యూల్లో వాటాల విక్రయం కొనసాగుతుందన్నారు. దేశంలో ప్రస్తుతం 15 కంటెయినర్ ట్రెయిన్ ఆపరేటర్లు ఉన్నారన్నారు. కాంగ్రెస్ హయంలో కాన్కోర్లో మొత్తం 24.35 శాతం వాటాలు విక్రయించబడ్డాయన్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 54.80 వాటా వాటా ఉందన్నారు.