Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి ధారావిలో తొలి కేసు నమోదు
- అప్రమత్తమైన ముంబయి మున్సిపల్ అధికారులు
న్యూఢిల్లీ : ఆందోళనకర వేరియంట్‌గా భావిస్తున్న ఒమిక్రాన్ రకం కేసుల సంఖ్య భారత్‌లో క్రమంగా పెరుగుతోంది.గుజరాత్లో తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.వీటితో పాటు ముంబయిలోని ధారావిలోనూ తొలికేసు నమోదైంది. దీంతో దేశంలో ఇంతవరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 26కి చేరింది.ఇటీవల జింబాబ్వే నుంచి ఓ వ్యక్తి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వచ్చారు.ఆయనకు కోవిడ్-19పరీక్షలు నిర్వహి ంచగా పాజిటివ్ అని తేలింది.ఆయనతో సన్నిహిత సంబంధాలు కొనసా గించిన వారికి పరీక్షలు నిర్వహించగా, ఒకరికి ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది.
ముంబయిలోనూ..
ఆసియాలోనే అతిపెద్ద మురికి వాడగా పేరున్న ధారావిలో ఒమిక్రాన్ బయటపడింది. ధారావికి చెందిన ఓ 45ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్టు బృహన్ ముంబయి మున్సిపల్ అధికారులు వెల్లడించారు. టాంజానియా నుంచి అతను ముంబయి చేరుకున్నట్టు తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయన సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో నిమగమయ్యారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'ఎట్-రిస్క్' దేశాల జాబితాలో టాంజానియా లేకపోవడంతో ధారావికి చెందిన వ్యక్తికి ఎయిర్‌పోర్టులో ఎటువంటి ఇబ్బందులు లేకుండానే నేరుగా వెళ్లిపోయారు. అయితే, సాధారణంగా విదేశాలనుంచి వచ్చేవారికి ర్యాండమ్ పద్ధతిలో చేస్తున్న కోవిడ్ పరీక్షల్లో భాగంగా ఆయన శాంపిళ్లను సేకరించారు. అందులో పాజిటివ్ తేలడంతో ఆ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. అందులో ఆయనకు సోకింది ఒమిక్రాన్ వేరియంట్ అని తాజాగా తేలింది. అప్రమత్తమైన అధికారులు ఆయనను ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి లక్షణాలు లేవనీ.. బాధితుడిని స్థానిక సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించి పర్యవేక్షిస్తున్నామని బీఎంసీ అధికారులు వెల్లడించారు.ఇక ధారావిలో నమోదైన కేసుతో ముంబయిలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్రలో మాత్రం ఈ సంఖ్య 11కు పెరిగింది.