Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోట్లు వెచ్చించినా..మారని పేదల జీవన ప్రమాణాలు
- అర్థ రహిత అభివృద్ధి
- కాంపోజిట్ పావర్టీ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: అభివృద్ధి కోసమే మా సర్కార్ అంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటున్నది. ఎక్కడ పడితే అక్కడ శిలాఫలకాలను వేస్తున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వేల కోట్లతో అదిగో..ఇదిగో అంటూ సాధ్యం కానీ ప్రాజెక్టులకు ..ఒకే చోట నుంచి రిమోట్‌తో ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇది నాణేనికి ఓవైపు మాత్రమే.. మరోవైపు వాస్తవికతను పరిశీలిస్తే..వివిధ రకాలైన పేదరిక సర్వే డేటాకోట్లు వెచ్చించినా..బడుగుల జీవన ప్రమాణాల్లో వెలుగులు నింపలేదన్న కఠోరవాస్తవాలు.. ఈ సర్వేలో బయటకొచ్చాయి.దేశంలో అభివృద్ధి వేగం పుంజుకుంటోందని కార్పొరేట్ మీడియా.. అధికారుల గణాంకాలను బట్టి తెలుస్తోంది. భారీ విగ్రహాల నిర్మాణానికి, సౌకర్యవంతమైన రైళ్లను నడపడానికి, వ్యాపార సంస్థల ఆదాయాన్ని పెంచడానికీ, కరోనా కాలం ఉన్నప్పటికీ కంపెనీల లాభాలు రయ్యిమంటూ దూసుకెళ్తున్నాయని ప్రచారం చేసుకుంటున్నది.అంతేకాదు బడ్జెట్లో అభివృద్ధికి ఇంత నిధులు కేటాయింపులు చూస్తే... ఆశ్చర్యపోవాల్సిందే? కానీ ఇవన్నీ దేశంలోని సామాన్యుల జీవితంలోనూ, ఆర్థిక ప్రమాణాల్లోనూ ఎలాంటి మార్పులు తెస్తాయి? ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న సర్వేలు కూడా వాస్తవాలను బయటపెట్టటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
కాంపోజిట్ పావర్టీ సర్వేలో ఏమున్నదంటే..
కోట్లు ఖర్చుపెడుతున్నా.. జీవన ప్రమాణాలు వెలుగులోకి రాని కోట్లాది మంది జనాభాకు అభివృద్ధి అంతా అర్థరహితమని ఈ సర్వేలో తేలింది. ఈ గణాంకాలు దేశంలోని చాలా రాష్ట్రాల్లో పేదరిక పరిస్థితిని తెలియజేస్తున్నాయి.
మిశ్రమ పేదరిక సర్వే ప్రమాణాలు
ఈ సర్వేలో, పోషకాహారం, పాఠశాలలో నమోదు, పాఠశాల విద్య, స్వచ్ఛమైన తాగునీటి లభ్యత, పారిశుధ్యం, వంట ఇంధనం లభ్యత, తల్లి ఆరోగ్యం, బ్యాంకు ఖాతాలు మొదలైనవాటితో సహా ఆరోగ్యం, విద్య , జీవన ప్రమాణాలకు సంబంధించి మూడు కోణాలకు సంబంధించిన 12 సూచికలు చేర్చబడ్డాయి. .నిటి ఆయోగ్ ద్వారా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం గుర్తించిన ''ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్'' రూపొందించిన పేదరికాన్ని అంచనా వేసే పద్దతి ఆధారంగా మొదటి సర్వే ఫలితాలు వారం కిందట విడుదలయ్యాయి. ఈ ఫలితాలను చూస్తే.. రాష్ట్రాలు,దేశవ్యాప్తంగా అభివృద్ధి గురించి వాస్తవికతను ప్రతిబింబిస్తాయి.
రాష్ట్రాల వారీగా ఈ గణాంకాలను పరిశీలిస్తే.. ఆందోళన కలిగిస్తున్నాయి. బీజేపీ భాగస్వామ్యపార్టీ నితీశ్ సర్కార్ అధికారంలో ఉన్నది. రెండోసారి గద్దెనెక్కినా అక్కడ గరీబోళ్ల బతుకుల్లో ఎలాంటి మార్పులేదని సర్వేలో వెల్లడైంది. బీహార్ జనాభాలో సగం మంది వివిధ రకాలైన పేదరికంతో (ఐదుకోట్ల మందికి పైగా ) బాధపడుతున్నారు, మధ్యప్రదేశ్‌లో ఈ జనాభా మూడు కోట్లు కాగా, రాజస్థాన్‌లో ఇది రెండు కోట్లకు పైగా ఉన్నది. మధ్యప్రదేశ్‌లోని ఆరు గిరిజన జిల్లాల్లోని యాభై శాతం జనాభా ఈ పరిధిలోకి వస్తుంది. ఇందులో అలీరాజ్‌పూర్‌లో 71 శాతం, ఝబువాలో 69 శాతం, దిండోరిలో 56 శాతం, సిధిలో 53 శాతం, సింగ్రౌలీలో 52 శాతం, రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో నలభై శాతానికి పైగా జనాభా పలురకాల వ్యాధితో బాధపడుతున్నారు. పేదరికం. ఇటీవల మధ్యప్రదేశ్‌లో గిరిజనుల అభివృద్ధిపై పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించారు.
దేశ జనాభాలో ఇంత శాతం మంది ప్రాథమిక అవసరాలకు దూరంగా ఉన్నారు, అది సాధించితే కానీ వివిధ రకాల పేదరికం పరిధిలోకి రారని సర్వే ధ్రువీకరించింది.
అభివృద్ధి & పేదరికం
అభివృద్ధికి కేటాయించే నిధులు , పథకాల గురించి..కేంద్ర బడ్జెట్ లోఅద్భుత గణాంకాలు ఉన్నప్పటికీ, పేద ప్రజల కోసం ఉజ్వల యోజన, పారిశుధ్య కార్యక్రమాలు, మాతృ ఆరోగ్య సంక్షేమ పథకాలు, గృహనిర్మాణ పథకాలు మొదలైనవి ఉన్నాయి. అయితే వీటికి కల్పిస్తున్న ప్రచారంలో..ఏఏ పథకాలకు ఎవరికీ లబ్ది చేకూర్చుతున్నాయి..? అనే దానిపైనే ఎన్నో అనుమానాలు..మరెన్నో సందేహాలు. ఎందుకంటే అసలైన లబ్దిదారుల డేటాను కూడా మోడీ ప్రభుత్వం గణాంకాల ఆటగా మార్చేసింది. దీంతో అర్హులై ఉండికూడా..సామాన్యులకు ప్రయోజనాలు అందడం లేదు, వారి దరికి చేరడం లేదు.
నిరాశపర్చేలా మార్గదర్శక సూత్రాలు
దేశ అపెక్స్ పాలసీ రెగ్యులేటరీ బాడీ నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాల ప్రకారం.. అంతర్జాతీయ సంస్థలు నిర్దేశించిన.. పౌష్టికాహారం, ఉపాధి, ఆరోగ్యం ఇతర సర్వేల విషయంలోనూ భారత్ వెనుకబడి ఉన్నది.
అభివృద్ధి పట్ల ప్రతికూలం... పేదల వ్యతిరేక దక్పథం
అభివృద్ధి అంటే దేశం లేదా ప్రజల అభివృద్ధి అనే భావన లేదు. విగ్రహాలు, హైవేలు, ఆధునీకరణ, విమానాశ్రయాల నిర్మాణం, బడా కంపెనీల వ్యాపారం, పెద్ద పెద్ద ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. అలాంటి పరిస్థితిల కారణంగా.. బీహార్‌లో పేదరికం విస్తృతంగా మారింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లోనూ సుపరిపాలన నినాదం ప్రచారం ఉన్నప్పటికీ అక్కడ వివిధ రకాలైన పేదరికంలో మగ్గుతున్నది. అయితే ఈ సర్వేల ఫలితాలను చర్చించే ఉద్దేశం, ప్రాధాన్యతలు లేకపోవడం గమనిం చాల్సిన విషయం. అణగదొక్కిన వర్గాలను వదిలించుకోవాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.పెరగని ఆదాయం, ఉపాధి, ఆరోగ్యం, విద్య లాంటి కీలకమైన అంశాల్లో వివిధ రకాలైన పేదలు అణచివేతకు గురవుతున్నారని వారు చెబుతున్నారు.
పేదరికానికి ప్రధాన సూచికల స్థితి..
ఆహారం..
ఇంధనం కొరత 58.5
స్వచ్ఛత 52
గృహాలు 45.6
పౌష్టికాహారం 37.6
గర్బిణీ ఆరోగ్యం 22.6
తాగునీరు 14.6
పాఠశాల విద్య 13.9
అత్యధిక శాతం పేదరికం ఉన్న రాష్ట్రాలు
రాష్ట్రం శాతాల్లో..
బీహార్ 51.6
ఉత్తర్‌ప్రదేశ్ 38
మధ్యప్రదేశ్ 36.65
రాజస్థాన్ 29.5
గుజరాత్ 18.6
మణిపూర్ 17.8
తెలంగాణ 13.2