Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బేటి బచావో.. పడావో నిధుల్లో 78.91 శాతం ప్రచారానికే : పార్లమెంటరీ కమిటీ
న్యూఢిల్లీ : ప్రభుత్వ పథకాల అమలు ఏ తీరుగా ఉంటుందో చెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణ 'బేటీ పడావో..బేటీ బచావో'. మోడీ సర్కార్ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన పథకం 'బేటీ పడావో బేటీ బచావో' పేద, మధ్య వర్గాల ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించింది. ఎన్నికలు ముగిసాక..ప్రజలతో అవసరం తీరాక అన్ని పథకాల్లాగే ఇదీ పక్కకుపోయింది. గత ఐదేండ్లలో ఈ పథకానికి కేంద్రం రూ.848కోట్లు కేటాయించగా, అందులో బాలికల కోసం ఖర్చు చేసింది రూ.156.46కోట్లు మాత్రమే ఉందని లెక్కతేలింది. మరొక విషయం, రాష్ట్రాలకు విడుదలైన నిధుల్లో 78.91శాతం అడ్వర్టయిజ్మెంట్ల(ప్రచారం, ప్రకటనలు)పై ఖర్చు చేశారని తేలింది. ఈ పథకం అమలుతీరుపై 'మహిళా సాధికారత' కమిటీ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో పై విషయాల్ని బహిర్గతం చేసింది. మహారాష్ట్ర బీజేపీ ఎంపీ హీనా విజరుకుమార్ గావిత్ కమిటీకి నేతృత్వం వహించారు.
కేంద్రం ఈ పథకాన్ని 2015లో ప్రారంభించింది. సమాజంలో ఆడ శిశుజనాల రేటు పెంచడం, లింగ అసమానతల్ని రూపుమాపటం, మహిళా సాధికారత పెంచటం, బాలికా విద్యను ప్రోత్సహిం చటం..తదితర లక్ష్యాల్ని నెరవేర్చడం కోసం ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ప్రారంభించారు. రాష్ట్రాల్లో పథకం అమలు జరిగిన తీరుపై పార్లమెంట్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల విడుదలపై కేంద్రం మరింత ప్రణాళికబద్దంగా వ్యవహరించాలని సూచించింది. విద్య, వైద్యంలో నిధుల వ్యయంపై దృష్టిసారించాలని పేర్కొన్నది.