Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు
న్యూఢిల్లీ : భారత్‌లో మానవ హక్కులపై దాడి జరుగుతోందని, హక్కుల కార్యకర్తల్ని జైల్లో నిర్బంధిస్తున్నారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.'మానవ హక్కుల దినోత్సవం'సందర్భంగా శుక్రవారం 15కుపైగా దేశాల్లో ప్లకార్డులతో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. 'నిరసన తెలపటం జాతి విద్రోహం కాదు-ప్రజా గొంతుకల్ని అణచివేయటం జాతి విద్రోహం' అని తెలిపే ప్లకార్డులతో హక్కుల గ్రూపులు పారిస్, సిడ్నీ, మెల్బోర్న్, కౌలాలంపూర్, కేప్‌టౌన్,టోక్యో, న్యూయార్క్,ఆమ్స్టర్డామ్ మొదలైన నగరాల్లో ప్రదర్శనలకు దిగాయి.భారత్‌లో హక్కుల ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నామని, పాలకుల అణచివేతపై గొంతెత్తుతున్న వారికి మద్దతు పలుకుతున్నామని మానవ హక్కుల గ్రూపులు ప్రకటించాయి.