Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ : దేశంలో రోజువారీ కొత్త కేసులు విజృంభణ తగ్గుముఖం పడుతున్నా, ఒమిక్రాన్ వేరియంట్ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. అధిక కోవిడ్ పాజిటివిటీ ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, అడ్మినిస్ట్రాటర్స్కు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాసారు. దేశవ్యాప్తంగా రోజువారీ కేసులు భారీగా క్షీణిస్తున్నా..మహ్మమారికి వ్యతిరేకంగా పోరాటంలో దేశం ఇంకా విమర్శనాత్మంగా ఉందని లేఖలో రాజేష్ భూషణ్ పేర్కొన్నారు.