Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచీ : గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ బుధు భగత్‌ను బ్రిటీష్ వారు కాల్చి చంపిన చారిత్రక స్థలంలో ప్రాజెక్టులు నిర్మించాలన్న కేంద్ర ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్‌తో పాటు ఆదివాసీ సంఘాల సంయుక్త వేదిక ఆధ్వర్యాన భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ పోరాట వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్ వద్ద ఆందోళన చేశారు. ఈ పోరాటానికి సిపిఎం మద్దతు తెలియజేసింది. రాంచిలోని మార్టి స్మారక స్థూపానికి పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పూలదండ వేశారు.