Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్ము : వలస వెళ్లిన కాశ్మీరీ పండిట్లు తిరిగిరావాలని, వారికి పునరావాసం కల్పించాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి) తీర్మానం చేసింది. ఎన్సి మైనార్టీ సెల్ సమావేశం శనివారం ఆ పార్టీ అధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లా అధ్యక్షతన జమ్ములో జరిగింది. కాశ్మీరీ పండిట్లు తిరిగిరావాలనే తీర్మానంతో సహా మూడు తీర్మానాలను ఈ సమావేశంలో ఆమోదించారు. పార్టీ సీనియర్ నేత అనిల్ ధార్ ఈ తీర్మానాలను ప్రవేశపెట్టగా వాయిస్ ఓటుతో ఆమోదించారు. ప్రార్థనా స్థలాలు, పుణ్యక్షేత్రాలను ప్రభుత్వం నిర్వహించాలనే తీర్మానాన్ని కూడా సమావేశంలో ఆమోదించారు.