Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మహిళలపై నేరాలు, మైనార్టీలపై దాడుల విషయంలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో ప్రధమ స్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. కేంద్రం సమాచారం ప్రకారం వరసగా మూడు ఏండ్ల నుంచి మానవహక్కుల ఉల్లంఘన కేసుల్లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం గత మూడు ఏళ్ల నుంచి ఈ ఏడాది ఆక్టోబర్ 31 వరకూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) వద్ద నమోదు కేసుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కేసులు 40 శాతానికి పైగా ఉన్నాయి.