Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈశాన్య భారతంలో నిరసనల హౌరు
- షా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్..
- దిష్టిబొమ్మ దహనం
కోహిమా: కేంద్ర మంత్రి అమిత్ షా అబద్దాల కోరు అనీ, నాగాలాండ్ పౌరుల ప్రాణాలు తీసిన ఘటనపై తప్పుడు, కల్పిత ప్రకటనలు చేసినందుకు ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఈ ఈశాన్య భారతంలో నిరసనలు హౌరెత్తాయి. ఆందోళనకారులు షా తో పాటు మరికొంత మంది నేతల దిష్టిబొమ్మలను సైతం దగ్ధం చేశారు. గతవారం నాగలాండ్‌లోని మోన్ జిల్లాలో మిటిటెంట్లు అని భావించి భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపాయి. ఈ ఘటన నేపథ్యంలో మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మోన్ జిల్లాలో 144 సెక్షన్ విధించడంతో పాటు టెలికామ్ సేవలను సైతం ప్రభుత్వం నిలిపివేసింది. అయినప్పటికీ.. ప్రజలు తమ నిరసనను విరమించుకోలేదు. తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ.. మోన్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 'వురు వాంట్ జస్టిస్' అంటూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఎక్కడ చూసినా సైన్ బోర్డుల మాదిరిగా నిరసన ప్లకార్డులు వెలిశాయి. సాధారణ పౌరులపై కాల్పులు జరిపి.. పౌరుల ప్రాణాలు తీసిన ఘటనను ఖండిస్తూ.. నాగాలాండ్‌తో పాటు ఈశాన్యంలోని అన్ని రాష్ట్రాల్లో నెమ్మదిగా ప్రారంభమైన నిరసనలు ప్రస్తుతం మహౌగ్రరూపం దాల్చాయి.మోన్ ఘటనపై పార్లమెంట్లో అమిత్ షా చేసిన ప్రకటన మరింత ప్రజాగ్రహానికి దారితీసింది. పార్లమెంట్లో షా చేసిన తప్పుడు, కల్పిత ప్రకటనపై క్షమాపణలు చెప్పాలంటూ ఉధృతంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మోన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 14 మంది కొన్యాక్ ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.