Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో రెచ్చిపోయిన హిందుత్వ శక్తులు
బెంగళూరు : బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకలో హిందుత్వ శక్తులు మరోసారి రెచ్చిపోయాయి. డోర్ టూ డోర్ ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కర్నాటకలో క్రైస్తవ మతానికి చెందిన పుస్తకాలను దగ్ధం చేశారు. రాష్ట్రంలోని కోలార్ పట్టణంలో ఈ దారుణం జరిగింది. రాష్ట్రంలో మైనార్టీలపై దాడులు చేయడం గత 12 నెలల్లో ఇది 38వ సారి. తాజా కేసులో ఇప్పటి వరకూ ఎవ్వరినీ అరెస్టు చేయలేదు. పైగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయవద్దనీ, మత పరమైన పుస్తకాలు పంచవద్దని క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తులనే పోలీసులు హెచ్చరించారు. ఈ కేసులో రెండు మతాలకు చెందిన వ్యక్తుల మధ్య రాజీ కుదిరిందని అందుకే ఎవ్వరినీ అరెస్టు చేయలేదని మీడియాకు పోలీసులు తెలిపారు. క్రైస్తవ మతానికి చెందిన ప్రతినిధులు తమ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళుతుండగా ఈదాడి చోటు చేసు కుంది. హిందుత్వ వ్యక్తులు వీరిని అడ్డగించి, వారి పుస్తకాలను లాక్కుని నిప్పుపెట్టారు. యునైటెడ్ క్రిస్టియన్స్ ఫోరం విడుదల చేసిన నిజ నిర్ధారణ నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకూ చర్చలు, క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తులపై 32 దాడులు జరగాయి. అక్టోబర్ నుంచి డిసెంబరు మధ్యలో ఆరు దాడులు జరిగాయి.