Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొద్ది సేపటి తరువాత పునరుద్ధరణ : పీఎంఓ
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా ఆదివారం కొద్దిసేపు హ్యాక్‌కు గురైంది. భారతదేశం 'బిట్ కాయిన్‌ను అధికారికంగా చట్టబద్ధమైన బిడ్‌గా స్వీకరించింది' అని పేర్కొంటూ ప్రధాని వ్యక్తిగత ఖాతాలో హ్యాకర్ ఒక ట్వీట్ చేశారు. భారతదేశం 'అధికారికంగా 500 బిట్కాయిన్లను కొనుగోలు చేసింది. వాటిని మనదేశంలో నివసించే వారికి పంపిణీ చేస్తోంది.' అని మరో పోస్ట్ చేశారు. దీనిని ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ట్వీట్‌ను తొలగించారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని, ఆ ఖాతాలో ఏవైనా ట్వీట్లు పోస్టు చేస్తే స్వల్పకాలం పాటు స్పందించవద్దని ప్రధాని కార్యాలయం కోరింది. అప్పటికే ఆ ట్వీట్‌ను స్క్రీన్‌షాట్ తీసి చాలామంది యూజర్లు షేర్ చేసినట్లు సమాచారం. ఈ హ్యాకింగ్ ట్విట్టర్ విధానపరమైన ఉల్లంఘన వల్ల జరిగింది కాదని అది తెలిపింది. ప్రధాన మంత్రి కార్యాలయంతో తమకు నిరంతర కమ్యూనికేషన్ సదుపాయం ఉందని, ప్రధాని ట్విట్టర్ హ్యాండిల్‌పై దాడి జరిగినట్లు తెలిసిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకున్నామని ట్విట్టర్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైన సమయంలో ఇతర ఖాతాలపై ఎటువంటి ప్రభావం పడలేదని అన్నారు. క్రిప్టో కరెన్సీపై బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో ఈ ట్వీట్ రావడం గమనార్హం.