Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో 38కి పెరిగిన కొత్త వేరియంట్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరం రేపుతున్నది. ఈ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆది వారం ఒక్కరోజే ఐదు ఒమిక్రాన్ కొత్త కేసులు నమోద య్యాయి. కొత్తగా కేరళ, ఛండీగఢ్, ఆంధ్రప్రదేశ్, కర్నా టక, మహారాష్ట్రలో కేసులు వెలుగుచూడటంతో.. ఒమి క్రాన్ వేరియంట్ కేసులు 38కి పెరిగాయి. ఒక్క మహా రాష్ట్రలోనే 18 ఒమిక్రాన్ కేసులు నమోదుకావడం స్థాని కంగా ప్రజలు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. పశ్చి మ ఆఫ్రికా నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుడి నమూనాలను సేకరించి.. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిందని నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎం సీ) కమిషనర్ రాధా కష్ణన్ తెలిపారు. అలాగే, ఐర్లాండ్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఓవిదేశీయుడికి ఒమిక్రాన్ వచ్చిందని గుర్తిం చారు. ఇటలీ నుంచి తమ బంధువులను చూడటానికి చంఢగీఢ్కు వచ్చిన ఓ యువకుడికి ఒమి క్రాన్ సోకింది. కర్నాటకలో.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఒమి క్రాన్ను గుర్తించారు. యూకే నుంచి అబుదాబీ మీదగా కేరళకు వచ్చిన వ్యక్తి కి కూడా ఒమిక్రాన్ సోకింది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒమి క్రాన్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. భారత్‌లోనూ ఈ వేరియంట్ కేసులు వెలుగుచూస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, దేశంలో పెరుగుతున్న వ్యాక్సినేషన్ నేపథ్యంలో భారత్‌పై ఒమిక్రాన్ తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. మిగిలిన రెండు త్రైమాసికాల్లో భారత ఆర్థిక పునరుద్దరణ మరింత మెరుగవుతుందని అంచనా వేసింది. ఇదిలావుండగా, కరోనా టెస్ట్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా అధికంగా ఉన్న 27 జిల్లాల్లో కఠినమైన నిఘా పెట్టాలని కేంద్రం సూచించింది. ఇక ఒమిక్రాన్ వేరియంట్‌ను కేవలం రెండు గంటల్లోనే గుర్తించగలిగే సరికొత్త టెస్టింగ్ కిట్‌ను దిబ్రూగఢ్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టెస్టింగ్ కిట్లు ఒమిక్రాన్‌ను గుర్తించడానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతున్నది.