Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. శ్రీనగర్ శివారులో పోలీసుల బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 14మంది పోలీసులు గాయపడగా.. వారిలో చికిత్సపొందుతూ ఒక ఏఎస్సై, సెలెక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ చనిపోయినట్టు కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు.పాంతాచౌక్ వద్ద జెవాన్ ప్రాంతంలోని పోలీస్ క్యాంపు సమీపంలోనే ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ సాయంత్రం సాయుధ పోలీస్ బెటాలియన్ బస్సుపై ఉగ్రవాదులు భీకర కాల్పులకు తెగబడినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో గాయపడిన వారిని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు.ఈ ఘటనతో అప్రమత్తమైన బలగాలు పాంతా చౌక్‌లోని జెవాన్ ప్రాంతాన్ని చుట్టుముట్టా యి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.