Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాస్తవాలను వక్రీకరిస్తున్న ఫోటోలు
- పలు ప్రపంచ ఎన్జీఓల ప్రకటనల్లో ఇలాంటివే..!
న్యూఢిల్లీ : ప్రపంచంలో ఉన్న పేదరికం విషయంలో వాస్తవాలను వెలికి తీస్తూ పలు గ్లోబల్ ఎన్జీఓలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. పేద దేశాల్లో అక్కడి ప్రజలు ముఖ్యంగా చిన్నారులు, మహిళలు పేదరికంతో ఎదుర్కొంటున్న సమస్యలను చూపెడుతూ ఆయా ప్రభుత్వాలకు సలహాలు, సూచనలిస్తున్నాయి. పేదరికం సమస్యను ఎదుర్కొనే విషయంలో ఈ ఎన్జీవో లు అందించే సమాచారం ఆయా దేశాల ప్రభుత్వాలు, సంస్థలకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. అయితే, ఇలాంటి సమాచారాన్ని వెల్లడించే క్రమంలో పలు ప్రపంచస్థాయి ఎన్జీఓలు మూస చిత్రాలను ఉపయోగిస్తున్నాయి. తమ వెబ్సైట్లలో కానీ, సామాజిక మాధ్యమాల్లో కానీ, మ్యాగజైన్లు, న్యూస్పేపర్లు వంటి వేదికల్లో ఇలాంటి చిత్రాలను పబ్లిష్ చేస్తున్నాయి. అయితే, గ్లోబల్ ఎన్జీఓలు అందించే సమాచారం ఉపయోగపడుతున్నప్పటికీ ఇలాంటి మూస చిత్రాలు పేదరికంపై వాస్తవాలను కప్పి ఉంచేలా లేదా వక్రీకరించేలా చేస్తున్నాయని కొందరు విశ్లేషకులు వాదించారు. కొన్ని చిత్రాల్లో కేవలం ఒక మహిళ మాత్రమే (ఇలాంటివి 7.5 శాతం చిత్రాలు) ఉండటం, మరికొన్ని చిత్రాల్లో తల్లిదండ్రులు లేకుండా ఇద్దరు చిన్నారులు మాత్రమే కనిపించడం, ఇంకొన్నిటిలో పురుషులు లేకుండా లేకుండా శిశువులు, తమ చిన్నారులతో మహిళలు ఉన్న ఫోటోలు కొన్ని ఉదాహరణలని వివరించారు. ఇవి ప్రజల్లోకి తప్పుడు సందేశాలను తీసుకెళ్తాయని తెలిపారు.