Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ, ఆర్బీఐ గవర్నర్ సంకేతాలు
న్యూఢిల్లీ : అనేక వైఫల్యాలతో సతమతమవుతున్న అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులను సంస్కరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విస్తృతమైన మార్పులను తీసుకురానున్నట్టు ఆ సంస్థ గవర్నర్ శక్తికాంత దాస్ సంకేతాలిచ్చారు. అధిక వడ్డీని అందిస్తున్న బ్యాంకుల్లో పొదుపు చేయడంపై ప్రజలను ఆయన హెచ్చరించారు. అధిక వడ్డీలు అధిక ఇబ్బందులను కలిగి ఉంటాయని తెలిపారు. ఈ విషయంలో దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఇటు ప్రధాని మోడీ కూడా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. '' సహకార బ్యాంకులో పనితీరును ఆర్బీఐ పర్యవేక్షిస్తే ఇది డిపాజిటర్ల విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మేము కొత్త సహకార మంత్రిత్వ శాఖ (సహకార మంత్రిత్వ శాఖను సూచిస్తూ) ను సృష్టించాం. సహకార వ్యవస్థ బలోపేతం చేయడం సహకార బ్యాంకులను మరింత శక్తివంతం చేయాలనే ఆలోచన ఉన్నది'' అని మోడీ అన్నారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ చెక్కులను కొన్ని బ్యాంకులకు చెందిన లబ్దిదారులకు అందించే సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుల విషయంలో మోడీ, ఆర్బీఐ గవర్నర్లు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.