Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీర్ఘశ్రేణి సూపర్సోనిక్ క్షిపణి ప్రయోగం
న్యూఢిల్లీ: భారత నేవీ కోసం రూపొందించిన సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ టార్పిడో వ్యవస్థ (స్మార్ట్)ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి ఈ క్షిపణి పరీక్షను అధికారులు చేపట్టారు. నేవీ కోసం ఆధునాతన ఆయుధ వ్యవస్థను రూపొందిస్తున్న డీఆర్డీఓ.. తాజాగా 'స్మార్ట్' పేరుతో సూపర్సోనిక్ క్షిపణిని తయారుచేసి విజయవంతంగా పరీక్షించింది.భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా జలాంతర్గాముల్లో పైనుంచి టార్పిడోలను ప్రయోగించేందుకు వీలుగా ఈ క్షిపణి వ్యవస్థను రూపొందించారు. ఈ పరీక్షలో.. నిర్దేశించిన లక్ష్యాన్ని క్షిపణి చేరుకోగలిగిందని డీఆర్డీఓ అధికారులు వెల్లడించారు. శుత్రదేశాల జలాంతర్గాముల ఉనికిని ముందుగానే పసిగట్టి.. వాటిపై ఈ సూపర్సోనిక్ క్షిపణులను ప్రయోగిస్తుందని తెలిపారు. భారత నేవీ కోసం ఈ క్షిపణి తయారు చేసినట్లు డీఆర్డీఓ పేర్కొంది.