Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్లో హిందూత్వ గూండాల పైశాచికం
భోపాల్ : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హిందుత్వ గూండాలు బరితెగిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని మంద్సౌర్లో ఆదివారం మధ్నాహ్నం 2 గంటలకు వివాహ వేడుకలోనే ఒక వ్యక్తిని హిందూత్వ గూండాలు తుపాకీతో కాల్చి చంపారు. 'జై శ్రీరామ్' నినాదాలు చేస్తూ వివాహ వేడుకలోకి దూసుకొచ్చిన గూండాలు అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ వివాహం చట్ట విరుద్ధంగా జరుగుతోందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాడికి పాల్పడిన 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేశారు.