Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారిడార్ తొలి దశను ప్రారంభించిన మోడీ
వారణాసి : కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టులో తొలి దశను ప్రధాని మోడీ సోమవారం ప్రారంభించారు. విశ్వనాధుని ఆలయ ప్రాంగణాన్ని గంగానది ఘాట్లతో కలపడంతో పాటు, భక్తులకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఐదు లక్షల స్కేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. సోమవారం ముందుగా తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసికి చేరుకున్న ప్రధాని మోడీ కాల భైరవ్ ఆలయంలో పూజలు చేశారు. తరవాత గంగా నదిలో స్నానం చేసి, ఈ నదిలో జలాలను కాశీ విశ్వనాథ్ ఆలయంలో పూజ కోసం తీసుకుని వెళ్లారు. ఆలయం చేరుకోవడానికి నగరంలోని వీధుల గుండా ప్రధాని వాహనంలో ప్రయాణించా రు.ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముందు ఒక ప్రార్థన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న కార్మికులపై పూల వర్షం కురిపించారు. కార్మికులతో గ్రూప్ ఫోటో దిగారు.ఈ ప్రారంభోత్స కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాధ్, బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా, దేశం నలుమూలల నుంచి వచ్చిన సాధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గతంలో కాశీ విశ్వనాధుని ఆలయ ప్రాంగణం కేవలం 3 వేల స్వేర్ ఫీట్ల విస్తీరణంలోనే ఉండేది.ఈ ప్రాజెక్టులో భాగంగా యాత్రికులు, భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించడానికి 23 నూతన భవనాలు నిర్మించారు. రూ. 339 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం 300కు పైగా ఆస్తులను కొనుగోలు చేయడం లేదా స్వాధీనం చేసుకోవడం జరిగింది.