Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తవేరియంట్ ఉప్పెనలా ముంచుకొస్తోంది: బోరిస్ జాన్సన్
- భారత్‌లో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుంది : జులియట్ పుల్లియం హెచ్చరికలు
న్యూఢిల్లీ: అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా అధికమవుతు న్నాయి. ఈ నేపథ్యంలోనే ఒమిక్రాన్ వేరియంట్ తొలి మరణం నమోదైంది. యూకేలో వేరియంట్ సోకినవారిలో ఓ వ్యక్తి చనిపోయినట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ధ్రువీకరించారు. ప్రస్తుత పరిస్థితులపై బోరిస్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న ది. ఇప్పటికే వ్యాక్సిన్ బూస్టర్ డోసును అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే, జనవరి 2022 నాటికి 18 ఏండ్లు పైబడిన వారంతా మూడో డోసు తీసుకోవాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నా రు. తాజాగా ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ గడవును ఈ నెలాఖరుకు కుదించారు. ఒమిక్రాన్ 'భారీ అలలా ముంచుకొస్తోంది' అని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ వేరియ ంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. గతంలో చవిచూసిన చేదు అనుభవాల ఆధారంగా ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాపించబోతోందో అంచనా వేయగలమని పేర్కొన్నారు. ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి ఇప్పటికే ప్రారంభమైందని యూకే ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుత డేటా ప్రకారం డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందన్నారు. అలాగే కొత్త వేరియం ట్‌పై వ్యాక్సిన్ ప్రభావం కూడా తక్కువుందన్నారు. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని చెప్పారు. అయితే, వ్యాధి తీవ్రతపై మాత్రం ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉందన్నారు. బూస్టర్ ఒక్కటే దీని కట్టడికి మార్గమని సూచించారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ల మూడో డోసు వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.
ముందస్తు చర్యలు అవసరం..
భారత్‌లోనూ కరోనా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో 40కి పైగా ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చేందే అవకాశాలు అధికంగా ఉన్నాయని దక్షిణాఫ్రికా డీఎస్ఐ-ఎన్ఎస్ఎఫ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎపిడెమియాలజికల్ మోడలింగ్ అండ్ ఎనాలిసిస్ డైరెక్టర్ జూలియట్ పుల్లియం అంచనా వేశారు.ము ందస్తు అంచనాలకు అనుగుణంగా ఆస్పత్రులు, వైద్య సౌకర్యాల కల్పనకు సిద్ధం కావడం అత్యంత కీలక తెలివైన పని అని ఆమె అన్నారు. ఇదివరకు చూసిన వేరియంట్ల కంటే ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని తెలిపారు. అయితే, ఇది ఏంతవరకు వ్యాధి తీవ్రత ప్రభావాన్ని కలిగివుంటుందనేది తెలియలేదని తెలిపారు. టీకా తీసుకున్నవారితో పాటు ఇదివరకు వైరస్ బారినపడ్డవారిలో తక్కువ ప్రభావం చూసే అవకాశముందని ఆమె అంచనా వేశారు. భారత్‌లో ఇంకా చిన్నారులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించలేదు కాబట్టి ప్రస్తుతం వారిపై ప్రభావం చూసే అవకాశమూ లేకపోలేదని అన్నారు. వారికి టీకాలు వేయడం మంచిపనిగా తాను భావిస్తున్నానని పుల్లియం చెప్పారు.