Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకిక వాదానికి వ్యతిరేకంగా కొందరు జడ్జిల తీరు..
- అది రాజ్యాంగ విరుద్ధం ొ రాత్రికి రాత్రే నియామకాలా..?
- సుప్రీం కోర్టుకు రాకుండా జస్టిస్ ఖురేషికి అడ్డు
- చారిత్రాత్మక రైతు ఉద్యమ అమరవీరులకు ఘన నివాళి : రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ కీలకమనీ, దానికి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ పేర్కొన్నారు. సోమవారం రాజ్యసభలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు (వేత నాలు, సేవా నిబంధనలు) సవరణ బిల్లుపై జరి గిన చర్చలో సీపీఐ(ఎం) తరఫున జాన్ బ్రిట్టాస్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ ఏడాదికిపైగా సుదీర్ఘంగా జరిగిన చారిత్రా త్మక విజయవంతమైన రైతు ఉద్యమంలో అమరు లైన రైతులకు ఘనమైన నివాళి తెలుపుతున్నానని ఎంపీ జాన్ బ్రిట్టాస్ తెలిపారు. నాగాలాండ్‌లో అమాయక ప్రజల హత్యకు సంతాపం తెలుపుతు న్నాను. అలాగే జనరల్ బిపిన్ రావత్, ఇతరలకు సంతాపం తెలుపుతున్నాను. సస్పెన్షన్‌కు గురైన 12 మంది సహచర ఎంపీలకు సంఘీభావం తెలుపుతున్నా. అప్రజాస్వామ్యక పద్ధతిలో సస్పెన్షన్ జరిగిందని, అధికార పార్టీ నేత చొరవ తీసుకొని సస్పెన్షన్ ఎత్తివేసి, వారిని తిరిగి సభకు తీసుకురావాలని కోరారు. నేను కొత్త సభ్యుడినైనా కావచ్చు కానీ, 1988 నుంచి జర్నలిస్టుగా పార్లమెంట్ కవర్ చేశానని తెలిపారు. ఈ సభలో చాలా గొడవలు చూశానని, శంకర్ దయాల్ శర్మ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఏడ్చే ఘటన చోటు చేసుకుందని, ఆ ఘటనలో బీజేపీకి చెందిన ఒకరు ఇప్పటికీ ఉన్నారని తెలిపారు. కానీ ఒక్క సభ్యుడుపై కూడా చర్యలు తీసుకోలేదనీ, ఒక్క సభ్యుడిని కూడా సస్పెండ్ చేయలేదని వివరించారు. ఇప్పుడు పేరు లేకుండా తన పార్టీ సభా పక్ష నేతను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లులో న్యాయమూర్తుల పెన్షన్ గురించి పొందిపరిచారనీ, దానికి తాము అంగీకరిస్తున్నామని అన్నారు.అయితే ఎవరు నిర్ణయిస్తారనేదే తమ ప్రశ్న అని పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకం పాత్ర లేదని, ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా?అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా కూడా అలా జరగదని పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకంలో అనుసరించిన రహస్య పద్ధతి ప్రపంచంలో ఎక్కడా లేదనీ, మన దేశంలోనే ఉన్నదని విమర్శించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రను కాపాడాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఇది తమ పార్టీ అంశం కాదని, దేశం మొత్తం న్యాయ వ్యవస్థ స్వతంత్ర కోరుకుంటుందని తెలిపారు. సభ్యులంతా దీనికి మద్దతు ఇస్తారని అన్నారు. తెలియని కారణాలతో న్యాయమూర్తులను బదిలీలు చేస్తున్నారనీ, వారిని శిక్షిస్తున్నారని విమర్శించారు. కొంత మంది ప్రధాన న్యాయమూర్తులు లౌకికవాదానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతున్నారనీ, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని అన్నారు. న్యాయమూర్తులు అవ్వడానికి వయస్సు పరిగణనలోకి తీసుకోరనీ, కొంత మందిని రాత్రికి రాత్రికే నియమిస్తున్నారని తెలిపారు. జస్టిస్ ఖురేషిని ఉద్దేశపూర్వకంగానే సుప్రీం కోర్టుకు రాకుండా చేశారని, ఆయన పేరు ప్రతిపాదనలో ఉన్నప్పటికీ తిరస్కరణకు గురయిందని అన్నారు. ఆయన ఒక శక్తివంతమైన వ్యక్తిని జైలుకు పంపించారనీ, అందువల్లే ఆయనను సుప్రీం కోర్టుకు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం హైకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సబార్డినేట్స్ కాదని, సుప్రీం కోర్టు, హైకోర్టులు రాజ్యాంగ కోర్టులని అన్నారు. మొదటి న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్ పదవీ విరణమ పొందిన న్యాయమూర్తికి ఎటువంటి పదవి ఇవ్వకూడదని రాజ్యాంగ అసెంబ్లీ చర్చల్లో పేర్కొన్నారని బ్రిట్టాస్ గుర్తు చేశారు. అదే న్యాయ వ్యవస్థ స్వతంత్ర అని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కూడా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులకు పదవులు ఇస్తే, వారిచ్చే తీర్పులపై ప్రభావం ఉంటుందని తెలిపినట్టు ఎంపీ బ్రిట్టాస్ పేర్కొన్నారు. మూడేండ్ల కిందట సుప్రీం కోర్టు రాఫెల్ కేసు కొట్టివేసిందనీ, సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ తొలగిస్తూ రాత్రికి రాత్రే ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఒక్క రోజులోనే రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేశారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని అన్నారు. దీన్ని సుప్రీం కోర్టు నిరాకరించింది. అయోద్య తీర్పు గురించి ఇక్కడ మాట్లాడను.ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో తెలియని అకౌంట్స్ నుంచి నిధులు వెళ్తున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం కూడా అఫిడవిట్ దాఖలు చేసిందనీ,దాన్ని కూడా న్యాయమూర్తులు మరిచారని విమర్శించారు.ఆ న్యాయమూర్తి ఎవరో అందరికీ తెలుసు, ఆయన ప్రస్తుతం ఈ సభలోనే సభ్యుడుగా ఉన్నారని తెలిపారు. ఎక్కువ మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బ్రహ్మణ కులానికి చెందిన వారేననీ, మిగతా కులాలు వారు కూడా న్యాయమూర్తులగా రావాలని తెలిపారు. అయితే తాను ఏ కులానికి వ్యతిరేకం కాననీ,కాకపోతే అందరికీ సమానత్వం కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
1980వరకు ఒక్క ఓబీసీ,ఎస్సీ,ఎస్టీ న్యాయమూ ర్తి కూడా సుప్రీం కోర్టులో లేరని తెలిపారు.ప్రజాస్వామ్యంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ కీలకమని తెలిపారు. ప్రతిక స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం గురించి అమెరికా అధ్యక్షుడుతో కలిసి జరిగిన సమ్మిట్‌లో ప్రధాని మోడీ అన్నారని గుర్తు చేశారు.ఇప్పుడు పార్లమెంట్ ప్రెస్ గ్యాలరీ ఎందుకు ఖాళీగా ఉన్నద నీ,సినిమా హాల్స్,బార్లు ప్రారంభించారనీ, విలేకరులను ఎందుకు రానీయటం లేదని ప్రశ్నించారు. చారిత్రాత్మక రైతు ఉద్యమ అమరవీరులకు ఘననివాళి అర్పించారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ప్రతిక స్వేచ్ఛ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.సుప్రీం కోర్టు బెంచ్ పెడితే భూమి,ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వైసీపీ ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాలు వల్లనే కోర్టుల్లో కేసులు పెండిం గ్లో ఉంటున్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు.