Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వరంగ సంస్థల్లో 3.63 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ
- ఏడేండ్లలో అత్యధికంగా ప్రయివేటు పరం
- పార్లమెంట్లో కేంద్రం వెల్లడి..
న్యూఢిల్లీ : మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమ (సీపీఎస్ఈ)ల్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణకు పచ్చజెండా ఊపారు. గత ఏడేండ్లలోనే సీపీఎస్ఈల్లో రూ.3,62,766 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నట్టు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కిషన్‌రావు కరడ్ పేర్కొన్నారు. లోక్‌సభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2014- 15 నుంచి 2020-21 వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో మొత్తం రూ.3,62,766 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. 2020-21లో డిజిన్వెస్ట్‌మెంట్ రసీదుల కోసం సవరించిన అంచనా రూ. 32,000 కోట్లు కాగా, 31 మార్చి 2021 నాటికి ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ రశీదు రూ. 32,845 కోట్లు అంటే 2020-21లో రివైజ్డ్ ఎస్టిమేట్లో దాదాపు 103 శాతం ఇది ఉన్నది.
ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ (కోట్లలో రూ.)
2014-15 24,349
2015-16 23,997
2016-17 46,247
2017-18 1,00,057
2018-19 84,972
2019-20 50,299
2020-21 32,845
మొత్తం 3,62,766