Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పీఎంకేర్స్ పిటిషన్'పై కేంద్రానికి బాంబే హైకోర్టు ఆదేశాలు
ముంబయి : పీఎంకేర్స్ ఫండ్, దాని అధికారిక వెబ్సైట్ నుంచి ప్రధాని మోడీ చిత్రాన్ని, పేరును తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. మహారాష్ట్రలోని థానే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రాంత్ చవాన్ బాంబే హైకోర్టులో ఈ పిల్‌ను దాఖలు చేశారు. జాతీయ చిహ్నంతో పాటు జాతీయ జెండానూ పీఎంకేర్స్ ఫండ్ అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఇలాంటి చిత్రాలను ప్రచురించడం భారత రాజ్యాంగ నిబంధనలను, చిహ్నాలు, పేర్లు (నిరుపయోగ నివారణ) చట్టం 2005ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్త, ఎంఎస్ కర్ణిక్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్లో ''కీలక'' అంశాన్ని లేవనెత్తారని తెలిపింది. ఈ మేరకు దీనిపై స్పందన కోరుతూ కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో సూచనలు చేసేందుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్.. ధర్మాసనాన్ని రెండు వారాల సమయాన్ని కోరారు.