Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.950 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ : ల్యామినిటేడ్ ఉత్పత్తుల కంపెనీ గ్రీన్ ల్యామ్ ఇండిస్టీస్ విస్తరణలో భాగంగా నెల్లూరులోని నాయుడుపేటలో తమ మూడో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ యూనిట్‌ను తమ గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ నిర్వహించనుందని తెలిపింది. రూ.950 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్‌లో ఏడాదికి 2,31,000 క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది.
సంస్థ ప్లైవుడ్, పార్టికల్ బోర్డ్ విస్తరణలో భాగంగా వచ్చే రెండు, మూడేళ్లలో రూ.950 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. మెషీనరీపై రూ.600 కోట్లు, ల్యామినేట్ సామర్థ్యం ఏర్పాటుకు రూ. 225 కోట్లు చొప్పున వెచ్చించనున్నట్లు గ్రీన్‌లామ్ ఇండిస్టీస్ ఎండి, సిఇఒ సౌరభ్ మిట్టల్ వెల్లడించారు.