Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అహారోత్పత్తుల ధరలు రెట్టింపు
- 12 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : దేశంలో ద్రవ్యోల్బణం సామాన్యులను బెంబేలెత్తిస్తుంది. వరుసగా ఎనిమిదో మాసంలోనూ టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపిఐ) రెండంకెల్లోనే నమోదయ్యింది. ప్రస్తుత ఏడాది నవంబరులో 14.23 శాతానికి ఎగిసి 12 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇంతక్రితం అక్టోబరులో ఇది 12.54 శాతంగా నమోదయ్యింది. ముఖ్యంగా ఇంధనం, మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, సహజ వాయువు, రసాయనాలు, రసాయన ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయని కేంద్ర గణంకాల శాఖ రిపోర్ట్‌లో వెల్లడయ్యింది. గడిచిన నవంబర్‌లో ఇంధనం, విద్యుత్ విభాగ ద్రవ్యోల్బణం 39.81 శాతానికి చేరడం ఆందోళనకరం. ఆహార పదార్థాల ధరలు రెండింతలు పెరిగాయి.
అక్టోబరులో 3.06 శాతంగా ఉన్న అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 6.70 శాతానికి ఎగిసింది. తయారీ వస్తువుల ధరల్లో మాత్రం కొంత ఉపశమనం ఉంది. ఇంధనం, విద్యుత్ ధరల పెరగడం వల్లే నవంబరు టోకు ద్రవ్యోల్బణం భారీగా ఎగబాకిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గడిచిన నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.48 శాతానికి ఎగిసి మూడు నెలల గరిష్ఠానికి చేరింది.