Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16, 17 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సమ్
- మెబ్యాంకుల జాతీయకరణ సందర్భంగా 1969 జులైలో టైమ్స్ ఆఫ్ ఇండియా మొదటి పేజీ కథనం
ఆర్బిఐ అంతర్గత వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యుజి)కి చెందిన ఐదుగురు సభ్యుల కమిటీ 10మంది నిపుణులతో చర్చలు జరిపింది. వారిలో నలుగురు నిపుణులు ఆర్బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్లే. మిగిలిన ఆరుగురు ప్రైవేటు బ్యాంకుల, ఇతర ప్రైవేటు సంస్థల అధినేతలే. మొత్తంగా పదిమంది నిపుణుల్లో 9మంది దీనికి విరుద్ధమైన అభిప్రాయాలనే స్పష్టంగా వెలిబుచ్చారు. అయినా కానీ, కార్పొరేట్ పారిశ్రామిక సంస్థలు బ్యాంకులను ప్రారంభించుకోవడానికి అనుమతిస్తామంటూ ఐడబ్ల్యుజి సిఫార్సు చేసింది.
1969 వరకు భారతీయ స్టేట్ బ్యాంక్, దాని అనుబంధ సంస్థలు మినహా అన్ని బ్యాంకులూ ప్రైవేటు చేతుల్లో వున్నాయి. ఈ సమయంలో ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బులో ప్రజలు గణనీయ మొత్తాల్లో కోల్పోయిన ఫలితంగా దివాళా తీయడంతో 500కి పైగా ప్రైవేటు బ్యాంకులు కుప్పకూలాయి. బ్యాంకుల నిధులను తమ స్వంత వ్యాపారాలను అభివృద్ధిపరిచేందుకు ఉపయోగించుకున్న కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లో మిగిలిన బ్యాంకులు వున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకో లేదా సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికో ఈ బ్యాంకులు చేసిందేమీ లేదు. అందుకే 14 ప్రధాన ప్రైవేటు బ్యాంకులను జాతీయకరణ చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తంగా వర్గ బ్యాంకింగ్‌కు బదులుగా ప్రజా బ్యాంకింగ్‌కు మారిపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్బి) జాతీయ ప్రాధాన్యతలైన వ్యవసాయం, చిన్న, మధ్య తరహా, సూక్ష్మ పరిశ్రమలు, ఉపాధి కల్పన వంటి వాటి కోసం పనిచేయడం ఆరంభించాయి. 1969 తర్వాత కూడా, గత 51ఏళ్ళలో, 38 ప్రైవేటు బ్యాంకు లు దివాళా తీశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులే వీటిని స్వాధీనం చేసుకోవడం ద్వారా మెజారిటీ బ్యాంకులను, వారి డిపాజిటర్ల డబ్బును కూడా కాపాడగలిగాయి.
కానీ అందుకోసం, ఈ బ్యాంకుల డిపాజిటర్లు భారీగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 1990వ దశకం ప్రారంభంలో, నయా ఉదారవాద విధానాలు ప్రారంభించడంతో 10 కొత్త తరం ప్రైవేటు బ్యాంకులు అట్టహాసంగా, ఆర్భాటంగా ప్రారంభమయ్యాయి. కానీ, చాలా స్వల్ప కాల వ్యవధిలోనే గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, టైమ్స్ బ్యాంక్‌తో సహా నాలుగు ప్రైవేటు బ్యాంకులు దివాళా తీశాయి.
బ్యాంకులను ప్రారంభించేందుకు కార్పొరేట్ పారిశ్రామిక సంస్థలకు లైసెన్స్
గతంలో, అంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ చర్యకు ముందుగా, ఆర్బిఐ అంతర్గత వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యుజి) గతేడాది నవంబరు 20న ఒక విధాన ప్రకటన చేసింది. బ్యాంకులను ప్రారంభిం చేందుకు కార్పొరేట్ పారిశ్రామిక సంస్థలను అనుమతిస్తామన్నది ఆ ప్రకటన సారాంశం. ఆర్బిఐ అంతర్గత వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యుజి)కి చెందిన ఐదుగురు సభ్యుల కమిటీ 10మంది నిపుణులతో చర్చలు జరిపింది. వారిలో నలుగురు నిపుణులు ఆర్బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్లే. మిగిలిన ఆరుగురు ప్రైవేటు బ్యాంకుల, ఇతర ప్రైవేటు సంస్థల అధినేతలే. మొత్తంగా పదిమంది నిపుణుల్లో 9మంది దీనికి విరుద్ధమైన అభిప్రాయాలనే స్పష్టంగా వెలిబుచ్చారు. అయినా కానీ, కార్పొరేట్ పారిశ్రామిక సంస్థలు బ్యాంకులను ప్రారంభించుకోవడానికి అనుమతిస్తామంటూ ఐడబ్ల్యుజి సిఫార్సు చేసింది. మన దేశ పాలక వర్గం తరచుగా ఉదాహరించే అమెరికాలో కూడా పరిశ్రమలు, వాణిజ్యం కలిసి ఉండవు. బ్యాంకులను ప్రారంభించేందుకు కార్పొరేట్ పారిశ్రామిక సంస్థలను అనుమతించలేదు. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం, ఈ విధాన మార్పు వల్ల మన ఆర్థిక వ్యవస్థకు కలిగి తీవ్రమైన పర్యవసానాలను పట్టించుకోకుండా కార్పొరేట్ పారిశ్రామిక సంస్థలు, బ్యాంకులను ప్రారంభించుకోవడానికి లైసెన్స్ ఇవ్వడానికే మొగ్గు చూపుతోంది. తర్వాత వాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులను అప్పగించనుంది. ప్రస్తుతం బ్యాంకింగ్ పరిశ్రమలో 74శాతం వరకు నేరుగా విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) కు అనుమతి వుంది. కొత్త తరం ప్రైవేటు బ్యాంకులు చాలా వాటిల్లో విదేశీ సంస్థల వాటా 51శాతం పైగానే వుంది.
ఉన్నత స్థాయిలో అవినీతి
కొన్నేళ్ళ నుండి ప్రైవేటు బ్యాంకుల్లో, బ్యాంకింగ్యేతర ఫైనాన్స్ కంపెనీల్లో (ఎన్బిఎఫ్సి) విశృంఖలంగా ఉన్నత స్థాయి అవినీతి చోటు చేసుకుంటూనే ఉంది. ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, లక్ష్మి విలాస్ బ్యాంక్ వంటి ప్రైవేటు బ్యాంకులు లేదా దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డిహెచ్ఎఫ్ఎల్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) వంటి ప్రైవేటు ఎన్బిఎఫ్సిలను ఉదాహరణగా తీసుకోవచ్చు. అప్పటి ఐసిఐసిఐ బ్యాంక్ అధినేత చందా కొచ్చర్ బ్యాంకులో తన పదవిని, అధికారాలను దుర్వినియోగం చేసిందని ఆరోపణలు వచ్చాయి. తన భర్త దీపక్ కొచ్చార్ ద్వారా అవినీతి మొత్తాన్ని తీసుకున్నందుకు వీడియోకాన్ గ్రూపునకు రుణాన్ని మంజూరు చేసింది. ఎస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ తన భార్య, కుమార్తె ప్రమోట్ చేసిన బూటకపు కంపెనీల ద్వారా ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇందుకు గానూ ఎస్ బ్యాంక్‌లో ఆ కంపెనీలకు రుణాలు మంజూరు చేశారు.
తర్వాతి కాలంలో ఆ కంపెనీలు నిరర్ధక ఆస్తులుగా మారిపోయాయి. డిహెచ్ఎఫ్ఎల్కి చెందిన వాద్వాన్ సోదరులు 2007, 2019 మధ్య కాలంలో దాదాపు 2,60,000మందికి బూటకపు గృహ రుణాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. పైగా అసలు ఉనికిలోనే లేని బాంద్రా శాఖ ద్వారా ఈ రుణాలు ఇచ్చినట్లు పేర్కొని ఆ మొత్తాలను దాదాపు 17,400కోట్ల రూపాయిలను తమ ఖాతాల్లో వేసుకున్నాయి.
వెలుగులోకి వచ్చిన కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవి. ఇంకా మరిన్ని అవినీతి, అవకతవకలు వెలుగులోకి రావాల్సి వుంది. ఇటువంటి అవినీతి కార్యకలా పాలకు పాల్పడిన వ్యక్తులకు ప్రభుత్వ రంగ బ్యాంకులను అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మె
అందువల్లే, పది లక్షల మంది ఉద్యోగులు, ఆఫీసర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు యూనియన్లు, నాలుగు ఆఫీ సర్ అసోసియేషన్లతో కూడిన యుఎఫ్‌బియు (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) డిసెంబర్ 16, 17 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలంటూ పిలుపునిచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని, వాటి ప్రైవేటీకరణను, ప్రజా వ్యతిరేక బ్యాంకింగ్ చట్ట సవరణలను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె పిలుపునిచ్చింది.
- సి.పి.కృష్ణన్