Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిదశ బ్యాంకుల జాతీయకరణ
బ్యాంకులను విలీనం చేయడం ద్వారా పెద్ద ఎత్తున సానుకూల ఫలితాలు వుంటాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని సంవత్సరాలుగా విలీన ప్రక్రియ జోరందుకుంది. అయితే, ఈ విలీనాల ఫలితాలేమిటి? అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ విలీనాల ప్రక్రియపై నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంకింగ్ రంగ సంస్కరణలలో భాగంగా ప్రభుత్వం 1991 తరువాత అనేక కమిటీలను నియమించింది. నరసింహ కమిటీ, లీలాభర్ కమిటీ, నాయక్ కమిటీ, రంగరాజన్ కమిటీ లాంటి అనేక కమిటీలు బ్యాంకింగ్ రంగ ప్రైవేటీకరణే ధ్యేయంగా అనేక సిఫార్సులు చేశాయి. వీటిలో బ్యాంక్ మెర్జర్స్ (విలీనాలు) ప్రధానమైనవి. దేశంలో ఉన్న 28 ప్రభుత్వరంగ బ్యాంకులను కలిపి 6 లేక 7 పెద్ద బ్యాంకులుగా చేయాలని నరసింహం కమిటీ 1993లోనే సిఫారసు చేసింది. పెద్ద బ్యాంకులుగా చేసి, మూల ధన వాటాలను అమ్మటం ద్వారా ప్రభుత్వ వాటాను తగ్గించుకొని ప్రైవేటీకరణ చేయటమే దాని సారాంశం. బ్యాంకు ఉద్యోగులు, వామపక్ష ప్రజాతంత్ర శక్తుల పోరాటాల ఫలితంగా 20 ఏళ్లకు పైగా ప్రభుత్వం ముందుకెళ్లలేదు. కానీ కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనేక వాదనలను ముందుకు తెచ్చి ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలను చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుబంధ బ్యాంకులను ఎస్బిఐలో విలీనం చేసింది. ఈ మధ్యకాలంలో దేనా బ్యాంకు, విజయాబ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలిపింది. మిగిలిన బ్యాంకులను కూడా విలీనం చేస్తారనే వార్తలు వెలువడు తున్నాయి.దీనికి ప్రభుత్వం ముందుకు తెస్తున్నవన్నీ పసలేని వాద నలే. ప్రపంచ స్థాయి పోటీ కోసం ప్రపంచ స్థాయి పెద్ద బ్యాంకు లు వుండాలని, పెద్ద బ్యాంకులు నిర్వహణ ఖర్చులను తగ్గించు కొని లాభదాయకంగా అవుతాయని ప్రభుత్వ వాదన. కానీ అను భవం దీనికి విరుద్ధంగా, సమాజానికి అర్ధిక వ్యవస్థకు నష్టదాయ కంగా వుంది. ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది మరో దారని సామెత. అలాగే ప్రపంచమంతా చిన్న బ్యాంకుల మార్గమే మంచి దని చెపుతుంటే మన దేశం విలీనాల వైపు అడుగులేస్తున్నది.
పెద్దబ్యాంకులతో అసలుకే ముప్పు : ప్రపంచ బ్యాంకు
2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభకాలంలో అమెరికా, యూరప్‌లోని అనేక దేశాలలో అతిపెద్ద బ్యాంకులు కుప్పకూలీ ఆర్ధిక వ్యవస్థ మందగించిన విషయం మనకు తెలుసు. ఆ అనుభవం తరువాత చిన్న బ్యాంకులే ఆర్ధిక వ్యవస్థకు శ్రేయస్కరమని ప్రపంచబ్యాంకు కూడా ప్రపంచ దేశాలకు సూచిస్తోంది. ఎంత పెద్ద బ్యాంక్ కుప్పకూలితే ఆర్ధిక వ్యవస్థకు అంత ఎక్కువ నష్టం. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలు అందాలంటే ఇంకా అనేక చిన్నచిన్న బ్యాంకుల కావాలని విలీనాల మీద 2013లో రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక కూడా విలీనాలను వ్యతిరేకించింది. పెద్ద బ్యాంకులు పెద్ద పెద్ద కార్పొరేట్లకు రుణాలివ్వటానికే మొగ్గు చూపుతాయని, ఫలితంగా సామాన్య ప్రజానీకానికి రుణాలు తగ్గిపోతాయని, బ్యాంకింగ్ సేవలకు సామాన్య ప్రజానీకం దూరమవుతారని, తక్కువ సంఖ్యలో బ్యాంకులుండటం వలన వీటి మధ్య పోటీ తగ్గి బ్యాంకింగ్ సేవల మీద చార్జీలు (రుసుము) పెరుగాయని రిజర్వ్ బ్యాంక్ నివేదిక చెప్పింది. అమెరికాలో కూడా బ్యాంక్ మెర్జర్స్ మీద జరిగిన పరిశీలనలో మెర్జర్ల ద్వారా అతిపెద్ద బ్యాంకులుగా రూపొందినవి. రుణాల మంజూరులో జాతి వివక్ష ప్రదర్శించినట్లుగా రుజువయింది.
విలీనాలు ఎందుకోసం?
నూతన ఆర్ధిక విధానాలలో భాగంగా వ్యవసాయ రంగం చేతి వృత్తులు, కుటీర - చిన్న పరిశ్రమలకు రుణాలిచ్చే బదులు కార్పొరేట్ కంపెనీలకు రూ. లక్షల కోట్లు అప్పులివ్వటం ప్రాధాన్యతగా మారింది. ప్రస్తుతం బ్యాంకులు తమ ఆర్ధిక స్తోమతను బట్టి, అనేక బ్యాంకులు కలిసి ఒక్కొక్క కంపెనీలకి రుణం ఇవ్వాల్సి వస్తుంది. విజరు మాల్యాకి 17 బ్యాంకులు కలిసి అప్పులిచ్చాయి. పెద్ద బ్యాంకులైతే కార్పొరేట్ కంపెనీలకు రుణాలిచ్చే శక్తి పెరుగుతుంది. ఆ కంపెనీలు తిరిగి చెల్లించకపోతే ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఆ బాకీలను రద్దు చేసుకొనే సామర్ధ్యం పెరుగుతుంది. అన్నికటికీ మించి విలీనాల ద్వారా పెద్ద బ్యాంకులైతే 5 లేక 6 బ్యాంకులలో పెట్టుబడలు ఉపసంహరణ, అంతిమంగా ప్రైవేటీకరణ సులభం అవుతుంది. విలీనాల ద్వారా సంఖ్యను కుదించి, మొండి బాకీలను రద్దు చేసుకొని బ్యాంకులు లాభాల బాట పట్టిన తరువాత ప్రైవేటీకరించటం సులభం, కొనటానికి పెట్టుబడి దారులు పోటీపడతారు.
ఏం చేయాలి..?
సామాన్య ప్రజానీకం, రైతాంగం, చిన్న పరిశ్రమల అవసరాలను తీర్చటానికి మరిన్ని చిన్న చిన్న బ్యాంకులు విస్తరించటం అవసరం. బ్యాంకు విలీనాలు, దేశ ఆర్ధిక వ్యవస్థకు చేటు చేస్తాయి.
సామాన్య ప్రజల డిపాజట్ల సొమ్ము వారి సంక్షే మానికి, దేశ ఆర్ధికాభివృద్ధికి ఉపయోగపడాలంటే ప్రైవేటీకరణకు దారితీసే విలీనాలను అడ్డుకోవడం ఒక్కటే మార్గం.
జాతీయ బ్యాంకులు ప్రభుత్వరంగ వాటా
1. అలాహబాద్ బ్యాంక్ 79.41%
2. ఆంధ్రాబ్యాంక్ 84.83%
3. బ్యాంక్ ఆఫ్ ఇండియా 87.05
4. బ్యాంక్ ఆఫ్ బరోడా 87.05
5. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 87.01
6. కెనరా బ్యాంక్ 72.55
7. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 88.02
8. కార్పొరేషన్ బ్యాంక్ 84.96
9.ఇండియా బ్యాంక్ 81.73
10. ఇండియాన్ ఓవర్సీస్ బ్యాంక్ 91.99
11. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 77.23
12. పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ 79.62
13. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 70.22
14.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 58.53
15. సిండికేట్ బ్యాంక్ 81.23
16. యూకో బ్యాంక్ 93.29
17. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 67.43
18. యూనిటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 92.25
పేమెంట్ బ్యాంక్
ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్ 100%