Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మమతా ప్రభుత్వంపై గవర్నర్ ఆగ్రహం
కొల్కత్తా : పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య ఉన్న వైరం మరోసారి బట్టబయలు అయింది. పెగాసన్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ వివరాలను కోరుతూ తాను రాసిన లేఖపై ప్రభుత్వం స్పందించకపోవడంపై గవర్నర్ జగదీప్ ధన్ఖర్ బుధవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విచారణ కోసం ఇద్దరు సభ్యులతో నియమించిన కమిషన్ నోటిఫికేషన్‌ను గురువారం సాయంత్రంలోగా తనకు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్‌కె ద్వివేదిని గవర్నర్ ఆదేశించారు.
తన లేఖపై స్పందించకపోవడం దురదృష్టకరం, తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో గవర్నర్ విమర్శించారు. రాజ్యాంగం, చట్టానికి అనుగుణంగా లేని 'తీవ్రమైన పాలన స్థితి'ని ఇది సూచిస్తుందని గవర్నర్ ఆరోపించారు. ప్రధాన కార్యదర్శికి తాను రాసిన లేఖను గవర్నర్ ట్విట్టర్లో పోస్టు చేశారు.