Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెక్స్ వర్కర్లకు ఆధార్, ఓటర్ ఐడీలను జారీ చేయాలని సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : వత్తితో సంబంధం లేకుండా ప్రాథమిక హక్కులు అందరికీ ఒకేలా వర్తిస్తాయని గుర్తించిన సుప్రీంకోర్టు.. సెక్స్ వర్కర్ల విషయంలో కేంద్రానికి కీలక ఆదేశాలిచ్చింది. వీరికి ఆధార్, రేషన్ కార్డులను జారీ చేసే ప్రక్రియ చేపట్టడంతో పాటు రేషన్ అందించేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించాలని కేంద్రానికి సూచించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో సెక్స్ వర్కర్లు ఎదుర్కొన్న సమస్యలపై దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... వారి సంక్షేమం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో వత్తితో సంబంధం లేకుండా వారికి రేషన్ అందించాలని కేంద్రాన్ని, ఇతరులను కోరింది. 2011లోనే వీరికి రేషన్ కార్డు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు చేసినప్పటికీ.. అమలు నోచుకోలేదని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, బిఆర్ గవారు, బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం గుర్తుచేసింది. 'దశాబ్దం క్రితమే వారికి గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలిచ్చాం. కానీ ఆ ఆదేశాలను ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదో కారణాలు తెలియదు' అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రాథమిక హక్కులనేవి, అతడు, ఆమె వతికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని, రేషన్, ఓటర్, ఆధార్ కార్డులు జారీ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర అధికారులను ఆదేశిస్తున్నామని పేర్కొంది.
అదేవిధంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఎన్ఎసిఒ), రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘాల సాయాన్ని తీసుకోవచ్చునని బెంచ్ ఆదేశించింది. వారికి రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, ఆధార్ కార్డుల జారీకి సంబంధించిన స్టేటస్ రిపోర్టు నేటి నుండి నాలుగు వారాల వ్యవధిలో దాఖలు చేయాలని, ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు.. రేషన్ పంపిణీ కొనసాగించాలని ఆదేశించారు.