Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో జాతీయ ఓబీసీ అఖిలపక్ష సమావేశంలో జనగణనలో కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశం పేర్కొంది. దీనికి సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఎంపీలు మద్దతు తెలియజేశారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం స్టేట్ కోఆర్డినేటర్ కొప్పుల చందుగౌడ్ మాట్లాడుతూ బీసీల లెక్కలు తీయాలనీ, పార్లమెంట్లో దీని గురించి చర్చించాలని అన్నారు. దేశవ్యాప్తంగా జనగణనను చేపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కులాలను లెక్కిస్తూ బీసీ కులాలను మాత్రం లెక్కించేది లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇది చాలా అన్యాయం అన్నారు. అలాగే చట్టసభల్లో బీసీలకు 50 శాతం విద్య ,ఉద్యోగ, ఆర్థిక , రాజకీయ, పారిశ్రామిక రంగాలలో రిజర్వేషన్లు కల్పించి, క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలనీ, సామాజిక న్యాయం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.