Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాగులోకి ఆర్టీసీ బస్సు బోల్తా
- డ్రైవర్ సహా పది మంది దుర్మరణం
- 25 మందికి తీవ్ర గాయాలు
ఏలూరు : ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలంలోని వాగులోకి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది దుర్మరణం చెందారు. వారిలో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 12 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు చొప్పున, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. బస్సు ప్రమాదంపై అధికారులు, క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం... ఆర్టీసీ బస్సు (పల్లె వెలుగు) భద్రాచలం నుంచి బుధవారం ఉదయం 8.30 గంటలకు ప్రయాణికులతో బయల్దేరి కుక్కునూరు మీదుగా జంగారెడ్డిగూడెం వస్తోంది. ఇంకో 15 నిమిషాల్లో జంగారెడ్డిగూడెం బస్టాండ్‌కు చేరుకుంటుందనుకుంటున్న సమయంలో మధ్యాహ్నం 12.10 గంటలకు వేగవరం శివారు జల్లేరు వాగు వంతెనపై నుంచి ఒక్కసారిగా వాగులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ కాకుండా 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తా పడడంతో ప్రయాణికుల ఆర్తనాదాలతో అప్రమత్తమైన పడవల్లో ఇసుక తరలించే జాలరులు, రాష్ట్రీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే డ్రైవర్ సహా తొమ్మిది మంది ప్రయాణికులు మతి చెందారు. వారితో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరో మహిళ మతి చెందింది. తీవ్రంగా గాయపడిన 25 మందిని జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మతదేహాలను జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. అక్కడికి చేరుకున్న మృతుల బంధువుల ఆర్తనాదాలతో ఈ ప్రాంతం మారుమోగింది.
ఏపీ ముఖ్యమంత్రి, గవర్నర్ దిగ్భ్రాంతి
బస్సు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, గవర్నర్ విశ్వభూషణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. మతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను, క్షత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని... జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి వచ్చి బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
మతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల చొప్పున పరిహారం : పీఎంఓ
బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియోను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మతుల కుటుంబ సభ్యులకు పిఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని అందజేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు పిఎంఓ ఇండియా బుధవారం ట్వీట్ చేసింది. మతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.