Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చమురు పన్నులతో కేంద్రానికి ఆదాయం
- 2021లోనే రూ.3.7 లక్షల కోట్ల రాబడి : మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : గత మూడేండ్లలో పెట్రోల్, డీజిల్‌పై పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.8.02లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ.3.71లక్షల కోట్లు పన్ను రాబడి వచ్చిందన్నారు. గత మూడేండ్లలో పెట్రోల్, డీజిల్‌పై విధించిన ఎక్సైజ్ డ్యూటీ వివరాలు, చమురుపై విధించిన పన్నులు, సమకూరిన ఆదాయానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని పార్లమెంట్లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ రాతపూర్వకంగా సమాధానంగా ఈ వివరాలు తెలియజేశారు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. లీటరు పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం 2018 అక్టోబర్ 5 నాటికి రూ.19.48 ఉండగా, ఈ ఏడాది నవంబర్ 4 నాటికి రూ.27.90కి పెరిగింది. ఇదే సమయంలో లీటరు డీజిల్‌పై పన్ను రూ.15.33 నుంచి రూ.21.80కు పెరిగింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో పెట్రోల్, డీజిల్‌పై వసూలు చేసిన సుంకాల వివరాలు గమనిస్తే.. 2018-19 ఏడాదిలో రూ.2,10,282 కోట్లు, 2019-20లో రూ.2,19,750 కోట్లు, 2020-21లో రూ.3,71,908 కోట్లు చమురు పై విధించిన సుంకాల రూపంలో ప్రభుత్వానికి రాబడిగా వచ్చిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో చమురుపై పన్నులు అధికంగా విధించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో చేరుకున్నాయి. దీంతో వాహనదారులతో పాటు సామాన్య ప్రజానీకంపైనా ప్రభావం పడింది. ప్రజా నిరసన నేపథ్యంలో ప్రభుత్వం ఇంధన పన్నులను కొద్దిగా తగ్గించింది. ఈ ఏడాది నవంబర్ 4న ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను వరుసగా రూ.5, రూ.10 తగ్గించింది. దీని అనంతరం ఎల్పీజీ సిలిండర్ ధరలు రికార్డు స్థాయిలో పెంచడం గమనార్హం.