Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ ఘటనపై వేసిన ప్రశ్నలతో ఆగ్రహం
- అసభ్యపదజాలంతో చేయి చేసుకున్న అజయ్ మిశ్రా
లక్నో: జర్నలిస్టులపై కేంద్ర హౌం సహాయ మంత్రి అజయ్ మిశ్రా అనుచితంగా ప్రవర్తించారు. లఖింపూర్ ఖేరీ ఘటనపై సిట్ దర్యాప్తు గురించి అడిగిన ప్రశ్నపై కేంద్ర సహాయ మంత్రి అజరు మిశ్రా టెనీ బుధవారం ఏబీపీ న్యూస్ రిపోర్టర్‌తో అనుచితంగా ప్రవర్తించారు. సిట్ దర్యాప్తుపై మంత్రి మిశ్రాను ఒక ప్రశ్న అడగడంతో...కోపం వచ్చేసింది. అంతే అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు.ఏబీపీ న్యూస్ రిపోర్టర్‌ను బెదిరించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడే ఉన్న మరో జర్నలిస్టు మొబైల్‌ను లాక్కొనే ప్రయత్నం చేశారు. విలేకరిని దుర్భాషలాడినందు కు కేంద్ర మంత్రి చర్యను ఖండిస్తూ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దీనిపై స్పందించిన రాకేశ్ తికాయత్ జర్నలిస్టుపై అసభ్యంగా ప్రవర్తించినందుకు బీజేపీ నాయకుడిపై హింసాత్మక కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ప్రవర్తన అసభ్యకరంగా ఉన్నదని విమర్శించారు. ''గూండా ముసుగులో ఉన్న వ్యక్తి.. గూండాగానే ప్రవర్తిస్తాడు. అతను ఎటువంటి ఉద్యమం చేయడు. అతను గూండాయిజం చేస్తాడు. దొంగిలిస్తాడు. దోపిడీకి పాల్పడతాడు. ప్రజలను చంపాడు'' అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే మంత్రి రాజీనామా చేయాలని తికాయత్ మళ్లీ డిమాండ్ చేశారు. అతడిని కేంద్ర క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని అన్నారు.