Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 219 సార్లు పెరిగిన డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: మూడేండ్లలో 234 సార్లు పెట్రోల్, 219 సార్లు డీజిల్, 21 సార్లు వంట గ్యాస్ ధరలు పెరిగాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. లోక్సభలో వివిధ పార్టీల ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021-22లో 69 సార్లు పెట్రోల్, 67 సార్లు డీజిల్, నాలుగు సార్లు వంట గ్యాస్ ధరలు పెరిగాయని మంత్రి తెలిపారు. అలాగే 2020-21లో 76 సార్లు పెట్రోల్, 73 సార్లు డీజిల్, 8 సార్లు వంట గ్యాస్ ధరలు పెరిగాయని కేంద్ర మంత్రి తెలిపారు. 2019-20లో పెట్రోల్ 89 సార్లు, డీజిల్ 79 సార్లు, 9 సార్లు వంట గ్యాస్ ధరలు పెరిగాయని చెప్పారు.
ఐదున్నరేండ్లలో రూ.14 లక్షల కోట్ల ఎక్సైజ్ డ్యూటీ వసూలు
దేశంలో గత ఐదున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై రూ.1,453,697 కోట్లు ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేసినట్టు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2016-17లో రూ.2,42,691 కోట్లు, 2017-18లో రూ.2,29,716 కోట్లు, 2018-19లో రూ.2,14,369 కోట్లు, 2019-20లో రూ.2,23,057 కోట్లు, 2020-21లో 3,72,970 కోట్లు, 2021-22 (ఏప్రిల్-సెప్టెంబర్) ఆరు నెలల్లో రూ.1,70,894 కోట్లు వసూలు చేసినట్టు కేంద్ర మంత్రి తెలిపారు.