Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొల్కత్తా: ఈ నెల 19 జరగనున్న కొల్కత్తా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మొహరించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ బీజేపీ వేసిన పిటీషన్‌ను కొల్కత్తా హైకోర్టు తిరస్కరించింది. ఈ ఎన్నికల్లో భద్రతకు రాష్ట్ర పోలీసులనే వినియోగించాలని ఆదేశించింది. ఈ మేరకు కొల్కత్తా పోలీస్ కమిషనర్‌కు జస్టిస్ రాజశేఖర్ ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, బీజేపీ ఈ పిటీషన్‌తో ముందుగా సుప్రీంకోర్టునే ఆశ్రయించగా, హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది.