Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: కరోనా రెండో దశ సమయంలో రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతతో ఎవ్వరూ చనిపోలేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. గురువారం లెజిస్లేటివ్ కౌన్సిల్ సాక్షిగా యోగి ప్రభుత్వం ఈ అబద్ధాన్ని పలికింది. 'రాష్ట్రంలో 22,915 కోవిడ్ మరణ ధృవపత్రాలను జారీ చేశాం. ఇందులో ఏ ఒక్క పత్రంలోనూ 'ఆక్సిజన్ కొరత కారణంగా మరణం' అని ప్రస్తావించలేదు' అని రాష్ట్ర ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ సభ్యుడు దీపక్ సింగ్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయాన్ని తెలిపింది. కరోనా రెండో దశలో ఉత్తరప్రదేశ్లో కేసులు విజృంభించాయి. ఆ సమయంలో రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని యోగి ప్రభుత్వంలోనే మంత్రులే ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన వ్యక్తుల మృతదేహాలను గంగా నదిలో పడవేస్తున్న వార్తలు కూడా మీడియాలో వచ్చాయి. అయినా బిజెపి ప్రభుత్వం ఆక్సిజన్ కొరతతో ఎవ్వరూ చనిపోలేదని ప్రకటించడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.