Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కాలంలో 2.84 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. గురువారం రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ బికాష్ రంజన్ భట్టాచార్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. లాక్డౌన్ కాలంలో (25 మార్చి 2020 నుంచి 1 జులై 2020 వరకు) 201.5 లక్షల పురుషులు, 83.3 లక్షల మంది మహిళలు ఉద్యోగులు కోల్పోయారని తెలిపారు. తయారీ రంగంలో 87.9 లక్షల పురుషులు, 23.3 లక్షల మహిళలు ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. నిర్మాణం రంగంలో 5.1 లక్షల పురుషులు, 1.5 లక్షల మహిళలు, వాణిజ్య రంగంలో 14.8 లక్షల పురుషులు, 4 లక్షల మహిళలు, రవాణా రంగంలో 11.1 లక్షల పురుషులు, 1.9 లక్షల మహిళలు, విద్యా రంగంలో 36.8 లక్షల పురుషులు, 28.1 లక్షల మహిళలు, వైద్య రంగంలో 14.8 లక్షల పురుషులు, 10.1 లక్షల మహిళలు, రెస్టారెంట్ రంగంలో 6.2 లక్షల పురుషులు, 1.7 లక్షల మహిళలు, ఐటీ రంగంలో 12.8 లక్షల పురుషులు, 6.1 లక్షల మహిళలు, ఆర్థిక సేవల రంగంలో 11.3 లక్షల పురుషులు, 5.7 లక్షల మహిళలు ఉద్యోగాలు కోల్పోయినట్టు కేంద్ర మంత్రి తెలిపారు.