Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మూక దాడులు పెరుగుతున్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పలు చోట్ల అమాయకులను కొట్టి చంపిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే, మూక దాడుల ఘటనలు, వాటి ద్వారా గాయపడిన, మరణించిన వారి వివరాలు తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్లో ఓ సభ్యుడు మూక దాడులకు సంబంధించిన వివరాలు తెలియజేయాలనే ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హౌం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద రారు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. మూక దాడులకు సంబంధించిన వివరాలు కేంద్రం వద్ద లేవనీ, మూక దాడుల్లో గాయపడిన, మరణాలకు సంబంధించిన ప్రత్యేక డేటాను నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో (ఎన్సీఆర్బీ) నిర్వహించదని రాజ్యసభలో మంత్రి వెల్లడించారు. మూకదాడుల నివరించడానికి తీసుకుంటున్న చర్యల వివరాలు వెల్లడిస్తూ.. మూక దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం టెలివిజన్-రేడియో మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించిందని చెప్పారు. అలాగే, మూక దాడులకు సంబంధించి తప్పుడు వార్తలు, పుకార్ల ప్రచారాన్ని నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని సర్వీస్ ప్రొవైడర్లకు ప్రభుత్వం అవగాహన కల్పించిందని తెలిపారు. తప్పుడు సమాచారం, పుకార్ల కారణంగా హింస, మూక దాడులను ప్రేరేపించే అవకాశముందని మంత్రి నిత్యానంద రారు అన్నారు. మూక దాడుల నిర్వహణక, అరికట్టడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు 2019 జూలై 23, అదే ఏడాదిలో సెప్టెంబర్ 25న సలహాలు జారీ చేసిందని వెల్లడించారు. మూక దాడులకు సంబంధించిన డేటాను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహిస్తాయని కేంద్ర మంత్రి నిత్యానంద రారు తెలిపారు.