Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో ఆందోళన
న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు వామపక్ష ఎంపీలు మద్దతు తెలిపారు. శుక్రవారం ఈ మేరకు పార్లమెంట్లో గేట్ 1 వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని ''బ్యాంక్ బచావో...దేశ్ బచావో, బ్యాంకుల ప్రయివేటీకరణ ఆపాలి, రెండు బ్యాంకుల ప్రయివేటీకరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి'' అంటూ నినాదాలతో హౌరెత్తించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం మాట్లాడుతూ జాతీయ బ్యాంకుల ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తున్న బ్యాంకు ఉద్యోగ సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలకు మద్దతు ఇస్తున్నామని అన్నారు. బ్యాంకులను ప్రయివేటీకరిస్తూ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, బిల్లును ఆమోదించుకొని జాతీయ బ్యాంకులను కార్పొరేట్లకు ప్రభుత్వం ఇవ్వజూపేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. బ్యాంకుల ప్రయివేటీకరణ ఆపాలనీ, ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంపీ బినరు విశ్వం, ఎం.సెల్వారాజ్,సీపీఐ(ఎం) ఎంపీలు పిఆర్ నటరాజన్, కె.సోమప్రసాద్, జర్నాదాస్ బైద్య, ఎఎం ఆరీఫ్, జాన్ బ్రిట్టాస్, వి.శివదాసన్, ఎల్జేపీ ఎంపీ ఎం.శ్రేయమ్స్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.