Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐసీ వద్ద పేరుకుపోయిన 32వేలకు పైగా అర్జీలు
- కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన అప్పీళ్లు క్రమంగా పేరుకుపోతున్నాయి. కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) వద్ద 32 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2019-20లో35,178, 2020-21లో 38,116 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 2021-22 ఏడాదికి గానూ డిసెంబర్ 6 నాటికి 32,147 దరఖాస్తులు సీఐసీ వద్ద పెండింగ్లో ఉన్నట్టు వెల్లడైంది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, ఫస్ట్ అప్పీలేట్ అథారిటీలకు మార్గదర్శకాలను జారీ చేయడం ద్వారా సామర్థ్యం పెంపొందించడం వంటి అనేక చర్యలను ప్రభుత్వం తీసుకున్నదనీ, దీనితో సమాచార కమిషన్కు తక్కువ సంఖ్యలో అప్పీళ్లు వచ్చాయని సింగ్ చెప్పారు. ప్రభుత్వ అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని గరిష్టంగా ముందుగానే బహిర్గతం చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. ఫలితంగా, పౌరులు ఆర్టీఐ దరఖాస్తులను నమోదు చేయాల్సినవసరం రాదని కేంద్ర మంత్రి తెలిపారు.