Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, బీజేపీ మధ్య శుక్రవారం ఎన్నికల పొత్తు కుదిరింది. రానున్న శాసనసభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని పంజాబ్ బీజేపీ ఇన్ఛార్జి గజేంద్రసింగ్ షెకావత్, కెప్టెన్ అమరీందర్ ధృవీకరించారు. సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య ఇప్పటివరకు ఏడుసార్లు చర్చలు జరిగాయి. తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. కెప్టెన్ అమరీందర్, గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం సమావేశమయ్యారు. రానున్న పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాలని నిర్ణయించారు.