Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియామకం చేసేసమయంలోనే కులం సర్టిఫికెట్లు వెరిఫై చేయాలి : పార్లమెంటరీ ప్యానెల్
న్యూఢిల్లీ: ఉద్యోగుల కెరీర్ ముగింపు సమయంలో కులం సర్టిఫికెట్లు వెరిఫై చేసే పద్ధతికి ముగింపు పలకాలని ఎస్సీ, ఎస్టీ ల సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. ఇలా చేస్తే పెన్షన్ ప్రయోజనాలు పొందడం ఉద్యోగులకు సులువుగా మారుతుందని వివరించింది. పలు అంశాలతో కూడిన నివేదికను ఈ ప్యానెల్ ఇప్పటికే పార్లమెంటుకు సమర్పించింది. ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరిన ఆరు నెలల లోపే ఆ వ్యక్తికి చెందిన కుల ధృవీకరణ పత్రాలను వెరిఫై చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సోన్నల్ అండ్ ట్రైనింగ్‌కు కమిటీ సూచించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేయాలని పేర్కొన్నది. ఉద్యోగి జాయినింగ్ సమయంలోనే వెరిఫికేషన్ ప్రక్రియ చేపడితే నకిలీ కుల ధృవపత్రాలతో ఎవరూ ఉద్యోగంలో చేరలేరని వివరించింది. బీజేపీ ఎంపీ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ ఈ నివేదికను రూపొందించింది. ''ఉద్యోగి కెరీర్ ముగింపు సమయంలో కులం సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలవుతున్న విషయాన్ని పార్లమెంటరీ కమిటీ గుర్తించింది. ఈ సమయంలో సదరు ఉద్యోగికి రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలు నిలిపివేయడం ఆ వ్యక్తిని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేయడమే'' అని ప్యానెల్ పేర్కొన్నది.